Thursday, December 19, 2024

నేటి నుంచి వాహనాలకు టిజిగా రిజిస్ట్రేషన్

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వం జారీ చేసే జీఓలన్నీ ప్రజలకు అందుబాటులో ఉంచుతాం

మనతెలంగాణ/హైదరాబాద్:  బిఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, మనోభావాలను అణచివేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం మాదిరిగా జీఓలను రహస్యంగా ఉంచాలనుకోవడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తమ ప్రభుత్వం జారీ చేసే జీవోలన్నింటిని ప్రజాబాహుళ్యంలో ఉంచుతామని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీఐ కింద పౌరులు కోరిన వివరాలు కూడా ఇవ్వాలని అధికారులకు చెప్పామని ఆయన పేర్కొన్నారు.

రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను కెసిఆర్ మోసం చేశారన్నారు. ఉద్యమ నాయకులను మోసం చేశారని ఆయన గుర్తుచేశారు. విపక్షాలను గౌరవించకుండా రాచరిక పోకడలను అవలంభించారన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అందరం టిజి అనే రాసుకున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రజల మనోభావాల మేరకు టిఎస్‌ను టిజిగా మార్చుతున్నామన్నారు. దీనిని శాసనసభ కూడా ఆమోదించిందని ఆయన గుర్తుచేశారు. పేరు మార్పునకు కేంద్రం కూడా ఒప్పుకుందని ఆయన వెల్లడించారు. నేటి నుంచే మార్పు మొదలు కానుందని, ఇకపై అన్ని వాహనాలపైనా టిజి అని ఉండబోతుందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News