Saturday, December 21, 2024

భూపాలపల్లి జిల్లాలో ప్రారంభమైన రిజిస్ట్రేషన్ సేవలు

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి కలెక్టరేట్: జిల్లాలో నూతనంగా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో డిప్యూటీ ఇన్స్‌స్పెక్టర్ సైదిరెడ్డి, జిల్లా రిజిస్ట్రార్ హరికొట్ల రవి ఆధ్వర్యంలో సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్‌తో రిజిస్ట్రేషన్స్ శనివా రం ప్రారంభించారు. రిజిస్ట్రేషన్ పిదప కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ భవేశ్ మి శ్రా చేతుల మీదుగా మొదటి రిజిస్ట్రేషన్ భూ దస్తావేజులు, మ్యారేజ్ సర్టిఫికేట్‌లు రి జిస్ట్రేషన్‌దారులకు అందజేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా వాసులకు అందుబాటులో రిజిస్ట్రేషన్ సేవలు అందనున్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, రిజిస్ట్రేషన్‌దారులు, త దితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News