Monday, December 23, 2024

ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌-2022కు ప్రారంభమైన రిజిస్ట్రేషన్లు..

- Advertisement -
- Advertisement -

Registrations begin to Inorbit Durgam Churuvu Run-2022

హైదరాబాద్‌: ఇనార్బిట్‌ మాల్‌ హైదరాబాద్‌ ఇప్పుడు తమ రెండవ ఎడిషన్‌ ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌-2022(ఐడీసీఆర్‌) నిర్వహణ కోసం సిద్ధమైంది. ఈ రన్‌ను మార్చి 6న నిర్వహించబోతుంది.ఈ రన్‌ కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 28లోపుగా నమోదు చేసుకునే వారికి 25% ఎర్లీ బర్డ్‌ ఆఫర్‌ను సైతం వారి దరఖాస్తులపై అందించనున్నారు. అంటే ఫిబ్రవరి 28లోపుగా 5కె రన్‌ కోసం 599 రూపాయలు, 10కిలోమీటర్ల పరుగుకు 999 రూపాయలు, 21 కిలోమీటర్ల రన్‌కు 1199 రూపాయలు (పన్నులు మినహాయించి)చెల్లిస్తే సరిపోతుంది. అంతేకాదు, తమ బిబ్స్‌పై పేర్లను సైతం తాము కోరుకున్నట్లుగా పొందవచ్చు. ఐడీసీఆర్‌–22తో వరుసగా రెండవసారి స్పోర్ట్స్‌ బ్రాండ్‌ పూమా భాగస్వామ్యం చేసుకుంది. ఈ రన్‌లో నమోదుచేసుకున్న వారందరూ 1000 రూపాయల ఖచ్చితమైన బహుమతితో పాటుగా పూమా నుంచి 1799 రూపాయల విలువ కలిగిన టీ షర్ట్‌ను సైతం పొందవచ్చు.

ఈ మారథాన్‌ను ప్రొఫెషనల్‌ స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ యూ టూ కెన్‌ రన్‌ నిర్వహిస్తుంది. అప్పెరల్‌ బ్రాండ్‌ లైఫ్‌స్టైల్‌ దీనికి ప్రైజ్‌ పార్టనర్‌గా వ్యవహరిస్తుంటే, రేడియో పార్టనర్‌గా ఫీవర్‌ ఎఫ్‌ఎం, టైమింగ్‌ పార్టనర్‌గా రమేష్‌ వాచ్‌ కో, ఎకో–సిస్టమ్‌ భాగస్వామిగా హైసియా వ్యవహరిస్తున్నాయి. ఏఐఐఎంఎస్‌ ఈ రన్‌ను సర్టిఫై చేసింది. ఈ మారథాన్‌ ఇనార్బిట్‌ మాల్‌ వద్ద ప్రారంభమై, హైదరాబాద్‌లో అత్యంత అందమైన ల్యాండ్‌మార్క్స్‌లో ఒకటిగా గుర్తింపు పొందిన దుర్గంచెరువు వంతెన మీదుగా సాగుతుంది. ఇనార్బిట్‌ దుర్గం చెరువు రన్‌-2022ను కోవిడ్‌–19 క్రీడా భద్రతా ప్రమాణాలను పరిగణలోకి తీసుకుని నిర్వహిస్తారు.

To register please visit: https://inorbitrun.inorbit.in/durgam-cheruvu-run/

Registrations begin to Inorbit Durgam Churuvu Run-2022

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News