Wednesday, January 8, 2025

రిజిస్ట్రేషన్లకు ఆధార్ దెబ్బ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: ఢిల్లీలో కురిసిన భారీ వ ర్షాల వల్ల ఆధార్ సెంట్రల్ సర్వర్‌లో ఏర్పడిన సాంకేతి క సమస్యల కారణంగా గురువారం దేశవ్యాప్తంగా ఆ ధార్ ఆధారిత సేవలకు తీవ్ర అంతరాయం కలిగిందని తెలంగాణ రాష్ట్ర రిజిస్టేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖ కమిషనర్, ఇన్‌స్పెక్టర్ జనరల్ కార్యాలయం తెలిపింది. దీని వ ల్ల తెలంగాణ రాష్ట్రంలోనూ రిజిస్ట్రేషన్స్ సేవలన్నీ నిలిచిపోయాయని వెల్లడించింది. రిజిస్ట్రేషన్స్‌కు ఆధార్ లింక్ కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి.

సాధారణంగా రోజుకు ఏడు వేలకు పై చిలుకు రిజిస్ట్రేషన్లు జరిగే శాఖ లో గురువారం కేవలం ఒక వెయ్యి డాక్యుమెంట్లు మాత్ర మే రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు రిజిస్ట్రేషన్‌ల కోసం జనం వేచిచూడాల్సి వచ్చింది. ఫొటోతో ఆధార్ మ్యాచ్ కాకపోవడం, నెంబర్ ఇచ్చినా ఓటిపి రాకపోవడం, ఓటిపి వచ్చినా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ కాకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. మీసేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసేవారికి కూడా ఇబ్బందులు తలెత్తాయి. తహశీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు జనాలతో కిక్కిరిసిపోయాయి.

కొన్ని మండలాల్లో మంగళ, బుధవారాల్లో పెండింగ్ పెట్టిన సేల్ డీడ్స్‌కు సంబంధించిన వారు కూడా వచ్చారు. దీంతో జనాల సంఖ్య బాగా పెరిగింది. అయితే ఆధార్ సర్వర్‌లో కలిగిన ఈ సాంకేతిక సమస్య కారణంగా ఇబ్బంది పడిన ప్రజానీకానికి, వారికి జరిగిన అసౌకర్యానికి అధికారులు విచారం వ్యక్తం చేశారు. సాంకేతిక నిపుణుల ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామన్నారు. గురువారం అర్థరాత్రి లోపు సమస్య పరిష్కరించబడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు అధికారులు. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ సర్వీసులను శుక్రవారం నాటికి రీషెడ్యూల్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News