Monday, January 20, 2025

అమర్‌నాథ్ యాత్ర కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

జమ్ము : ప్రతి ఏటా నిర్వహించే అమర్‌నాథ్ యాత్ర కోసం భక్తులకు సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. జులై 1న ప్రారంభం కానున్న ఈ యాత్ర 62 రోజుల పాటు సాగి ఆగస్టు 31తో ముగుస్తుంది. రెండు ప్రధాన మార్గాల ద్వారా యాత్రికులను పంపిస్తారు. అనంతనాగ్ జిల్లా పహల్గామ్ 48 కిమీ మార్గంలో, గండేర్‌బల్ జిల్లా లోని బల్తాల్ ట్రాక్ 14 కిమీ మార్గంలో యాత్రికులను పంపిస్తారు. దేశం మొత్తం మీద పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్రాంచిల్లో సోమవారం యాత్ర కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని బ్యాంకు చీఫ్ మేనేజర్ రోహిత్ రైనా వెల్లడించారు.

Also Read : IPL 2023: చెలరేగిన కాన్వే, శివమ్.. బెంగళూరు లక్ష్యం 227

మొత్తం 542 బ్యాంకు బ్రాంచిల ద్వారా రిజిస్ట్రేషన్ జరుగుతుందన్నారు. ఇందులో పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్రాంచిలు 316 వరకు ఉన్నాయి. అయితే ఈసారి రిజిస్ట్రేషన్‌లో ఆధార్ ద్వారా నమోదు ప్రక్రియ ప్రవేశ పెట్టారు. గత ఏడాది వరకు ఫారాలు నేరుగా ఇచ్చేవారు. కానీ ఈసారి ఆధార్ నమోదుతో ఫారాలు ఇస్తారు. అలాగే యాత్రికులు తమ ఆరోగ్యాన్ని ధ్రువీకరించే డాక్టర్ సర్టిఫికెట్లు కూడా చూపించవలసి వస్తుందని రైనా వివరించారు. జమ్ములో ప్రారంభమైన రిజిస్ట్రేషన్‌కు సంబంధించి పిఎన్‌బి బ్రాంచి కార్యాలయాన్ని పువ్వులతో అలంకరించారు. సోమవారం 9 గంటలకు కార్యాలయం ప్రారంభమైంది. ఉదయం 8.30 నుంచే యాత్రికులు క్యూలో నిలుచోవడం కనిపించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News