యాదాద్రి భువనగిరి:యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దర్శనార్ధం వచ్చే భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గత రెండు రోజులుగా వర్షాలు పడుతుండడం, హైదరాబాద్ బోనాల ఉత్సవాలతో స్వామివారి దర్శనార్ధం వచ్చేభక్తుల రద్దీ తగ్గింది. బుధవారం తెల్లవారుజామున సుప్రభాత సేవతో ఆలయాన్ని తెరిచిన అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహి ంచి, అభిషేకం, అర్చన, సుదర్శన నారసింహ హోమం, స్వామివారి నిత్యకల్యాణ మహోత్సవం, సువర్ణ పుష్పార్చన, వెండి జోడి సేవ, దర్బార్ సేవతో పాటు పలు నిత్యకైంకర్య పూజలను అర్చకులు నిర్వహించారు.
స్వామివారి నిత్యపూజల్లో భక్తులు పాల్గొని దర్శించుకున్నారు. కొండపైన కొలువుదీరిన శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయంలో కూడా భక్తులు దర్శించుకున్నారు. కొండ కిందగల అనుబంధ ఆలయమైన శ్రీపాత లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. యా దాద్రి భువనగిరి జిల్లా నూతనంగా వచ్చిన అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయగా, ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేయగా, ఆలయ అధికారి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.
ఆలయ నిత్యరాబడి..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్యరాబడి రూ.10, 19,524 వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్ర ధాన బుకింగ్ రూ.73,700, వీఐపీ దర్శనం రూ.30,000, బ్రేక్ దర్శనం రూ.34,800, వీఐపీ దర్శనం, రూ.30,000, ప్రసాద విక్రయం రూ.4,95,300, కొండపైకి వాహన ప్రవేశం ద్వారా రూ.2, 00,000తో పాటు వివిధ శాఖల నుంచి స్వామివారికి నిత్యరాబడి చేకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.