సిఎం కెసిఆర్ జోక్యం చేసుకుని తమ జీవితాల్లో వెలుగులు నింపాలి
కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొపెసర్ల జెఏసీ నాయకుల వినపం- Advertisement -
హైదరాబాద్సి: సిఎం కెసిఆర్ గతంలో తమకు ఇచ్చిన హామీని నేరవేర్చి రెగ్యులరైజేషన్ చేసేందుకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల జెఏసి నాయకులు కోరారు. శనివారం తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు మహా ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఓయూలో ఎన్నో సంవత్సరాలుగా బోధన, పరిశోధన, పరిపాలన విధుల్లో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తున్నారని, రెగ్యులరైజ్ చేయాలనే కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల డిమాండ్ చాలా న్యాయబద్ధమైందని పేర్కొన్నారు. వెంటనే సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులర్ చేయాలని తమ అసోసియేషన్ తరఫున సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయడం ద్వారా యూనివర్సిటీలను బలోపేతం చేయవచ్చునని తెలిపారు. అనంతరం ఓయూ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ కిషన్ ప్రసంగిస్తూ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లతోనే నేడు యూనివర్సిటీలను నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉందన్నారు.
రెగ్యులర్ టీచింగ్ ఫ్యాకల్టీ తో సమానంగా అన్ని అర్హతలతో యూనివర్సిటీలలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తున్నారని ఆయన వివరించారు. యూనివర్సిటీలలో గత పదేళ్లుగా టీచింగ్ ఫ్యాకల్టీ నియమాకాలు చేపట్టంలేదని దీంతో పెద్ద ఎత్తున ఖాళీలు ఏర్పడ్డయన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. అదే విధంగా కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల జేఏసీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ ఏ పరశురాం, వర్కింగ్ చైర్మన్ డాక్టర్ డి ధర్మతేజ, కో చైర్మన్ డాక్టర్ రాందాస్ నాయకులు మాట్లాడుతూ గత ఎన్నో ఏళ్లుగా యూనివర్సిటీలలో పనిచేస్తూ తమ జీవితాలను అంకితం చేశామని తెలిపారు. ఇప్పటికే కొంతమంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్ లేకుండానే రిటైర్ అయ్యారని, మరికొందరు పనిచేస్తూనే మృతి చెందారని, వారి కుటుంబాలకు ఎలాంటి నష్టపరిహారం అందలేదన్నారు.
గత మూడు నెలలుగా రెగ్యులరైజేషన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ అన్ని యూనివర్సిటీలలో వివిధ రూపాల్లో ఉద్యమాన్ని ఉద్యమాన్ని చేస్తున్నామన్నారు. ఇప్పటికైనా సిఎం కేసీఆర్ తమ పట్ల దయ తలచి కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేసేందుకు అధికారులకు తగిన లిఖితపూర్వక ఆదేశాలను జారీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ జేఏసీ స్టేట్ కన్వీనర్ డాక్టర్ కరుణాకర్ రావు, చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ బైరి నిరంజన్, కో-ఆర్డినేటర్ డాక్టర్ రాజేష్, మీడియా కో-ఆర్డినేటర్ డాక్టర్ సిహెచ్ పరందాములు, కాకతీయ,తెలంగాణ యూనివర్సిటీ నాయకులు డాక్టర్ దత్త హరి, డాక్టర్ నారాయణ గుప్తా, మహాత్మా గాంధీ యూనివర్సిటీ నాయకులు డాక్టర్ చింతా శ్యాంసుందర్, పాలమూరు యూనివర్సిటీ నాయకులు డాక్టర్ భూమయ్య, రవికుమార్ , శాతవాహన యూనివర్సిటీ నాయకులు డాక్టర్ యశ్వంత్, మనోజ్ , జేఎన్టీయూ నాయకులు డాక్టర్ సురేష్ నాయక్, శివారెడ్డి , తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం నాయకురాలు డాక్టర్ వినీత పాండే, డాక్టర్ ప్రియ, ఐఐటి బాసర నాయకులు ఉపేందర్ తదితరులు హాజరయ్యారు.