Monday, December 23, 2024

వైద్యశాఖలో 1331 కాంట్రాక్టు ఉద్యోగులు క్రమబద్దీకరణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వైద్యానికి శాఖలోని ఏడు విభాగాల్లోని 1331 కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉత్తర్వు ప్రతులను ఆయా యూనియన్ల ప్రతినిధులకు స్వయంగా అందజేసిన మంత్రి హరీశ్ రావు కుటుంబ సంక్షేమ విభాగంలో 68 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (మహిళలు), డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో 72, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిధిలో 156 ఫార్మసిస్ట్, 177 ల్యాబ్ టెక్నీషియన్,

2 పారామెడికల్ ఆప్తాలమిక్ ఆఫీసర్, 837 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (పురుషులు) 837, ఆయుష్ విభాగానికి చెందిన 19 మంది మెడికల్ ఆఫీసర్లు ఉన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో ఒక్క వైద్య ఆరోగ్యశాఖలోనే మొత్తం 1331 మంది క్రమబద్దీకరణ పొందారు. ఈనిర్ణయం పట్ల యూనియన్ల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఎంతోమంది కలను సాకారం చేసి, జీవితాల్లో వెలుగు నింపారని సీఎం కేసీఆర్ గారిని జీవితాంతం గుర్తు పెట్టుకుంటామన్నారు. మంత్రి హరీశ్ రావు కు ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News