Saturday, November 16, 2024

57 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ

- Advertisement -
- Advertisement -

Regularization of 57 thousand contract employees in Odisha

భువనేశ్వర్ : ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఒడిశా ప్రభుత్వం ఒడిశా ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. 57 వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించనున్నట్టు ప్రకటించింది. తన 75 పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ ప్రకటన చేయడం విశేషం. అయితే ఇకపై కాంట్రాక్టు నియామకాలను రద్దు చేయనున్నట్టు కూడా వెల్లడించారు. ప్రస్తుతం ఉన్నవారిని క్రమబద్ధీకరించనున్నామని , ఆప్ ఈ విధానంలో భర్తీ ప్రక్రియను నిలిపివేయనున్నట్టు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నోటిఫికేషన్‌ను ఆదివారం విడుదల చేయనున్నట్టు పట్నాయక్ వీడియో సందేశంలో తెలిపారు. తాజా నిర్ణయంతో ప్రభుత్వంపై ప్రతి ఏటా రూ. 1300 కోట్ల అదనపు భారం పడనున్నట్టు చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News