Thursday, December 26, 2024

గురుకుల కాంట్రాక్టు టీచర్ల క్రమబద్ధీకరణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: గురుకులాల్లోని కాంట్రాక్టు ఉ పాధ్యాయులకు రాష్ట్ర ప్రభు త్వం తీపికబురు చెప్పింది. గురుపూజ దినోత్సవం సం దర్భంగా సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న 567 మంది కాంట్రక్టు టీచర్లను రెగ్యులరైజ్ చేసింది. ఇ ప్పటికే బిసి గురుకులాల్లోని 139 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులర్ చేసిన విష యం తెలిసిందే. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉ త్తర్వులు జారీ చేసింది. 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ గురుకులాల్లో మొ త్తంగా 567 మంది ఉపాధ్యాయులను  కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించడం జరిగింది. అందులో స్టాఫ్ నర్సులు, లైబ్రేరియన్లు కూడా ఉన్నారు. రెగ్యులర్ ఉద్యోగుల తో సమానంగా పనిచేయించి న నాటి ఉమ్మడి రాష్ట్ర ప్ర భుత్వం వేతనాలను మా త్రం ఇవ్వలేదు. ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మా నవీయకోణంలో ఆలోచించి గురుకులాల్లో కాంట్రాక్టు ఉపాధ్యాయులకు రెగ్యులర్ ఉపాధ్యాయులతోపాటు పిఆర్‌సిని అమలు చేయాలని నిర్ణయించి ఉత్తర్వులు జారీ చేసింది.

వీరికి 12 నెలల పూర్తి వేతనాన్ని ఆరు నెలల ప్రసూతి సెలవులను వర్తింపజేయనుంది. కాంట్రాక్టు ప ద్ధతి లో సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తు న్న 567 మంది ఉపాధ్యాయుల్లో 504 మంది మ హిళా ఉపాధ్యాయులు కావడం వి శేషం. ఇక ప్ర భుత్వ నిర్ణయంపై కాంట్రాక్టు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సిఎం కెసిఆర్‌కు జీ వితాంతం రుణపడి ఉంటామని పేర్కొన్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలల కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల సంఘం ప్రతినిధులు మంత్రి కొప్పుల ఈశ్వర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మం త్రి కొప్పుల ఈశ్వర్ గతంలో ఇచ్చిన హామీ మేర కు కాంట్రాక్టు ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చే యడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లు గా తాము చేసిన పోరాటానికి ముఖ్యమంత్రి కెసిఆర్ స్పందించి రెగ్యులర్ చేయడం పట్ల సంఘం అధ్యక్షురాలు శెట్టి రజని, ప్రధాన కార్యదర్శి సిరిమళ్ల జానకమ్మ, కోశాధికారి విక్టోరియా, స్వప్నారెడ్డి, సునిత, కిరణ్మయి, చంద్రశేఖర్ ప్రసూన, గాయత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల తెలంగాణ ప్రభుత్వం సానుకూలంతో ఉందని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న నిర్ణయం అన్ని వర్గాల వారికి మేలు చేసే విధంగా ఉందన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News