Wednesday, January 22, 2025

వ్యవసాయేతర నోటరీ భూముల క్రమబద్దీకరణ…

- Advertisement -
- Advertisement -

వ్యవసాయేతర నోటరీ భూముల
క్రమబద్దీకరణకు సద్వినియోగం చేసుకోండి
ఆక్టోబర్ 31 తుది గడువు
మన తెలంగాణ /సిటీ బ్యూరో: పట్టణ ప్రాంతాలలోని వ్యవసాయేతర భూములకు ఉన్న రిజిస్టర్ కానీ నోటరైజ్డ్ పత్రాలను రెగ్యూలరైజేషన్ చేసుకొనుటకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జి ఓ 84 నుసద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కోరారు.ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జిఓ 84 ప్రకారం దరఖాస్తుతో పాటు నోటరైజేడ్ పత్రాలు, లింక్ పత్రాలు, ఆస్తి పన్ను రసీదులు, కరెంటు బిల్లు, నీళ్ల బిల్లు రసీదుతో పాటు అధీనమునకు సంబందించిన ఇతర ఆధారాలు మీ సేవ కేంద్రాల ద్వారా సమర్పించాలని తెలిపారు.

Also Read: నగర నిరుపేదలకు మరో శుభవార్త

125 చదరపు గజాలకు ఎలాంటి స్టాంపు డ్యూటీ గాని అపరాధ రుసుము ఉండదని తెలిపారు. 125 చదరపు గజాలకు మించిన స్థలాలకు దరఖాస్తు చేసిన తేదీ నాటికీ ఉన్న మార్కెటు రేటు ప్రకారం స్టాంపు డ్యూటీతో పాటు అదనంగా రూ. 5ల పెనాల్టీ విధించబడుతుందని తెలిపారు. దరఖాస్తులకు 2023 ఆక్టోబర్ 31వ తేదీ చివరి గడువు లోపు సమర్పించాలని ఆ తర్వాత ఏలాంటి దరఖాస్తులు స్వీకరణ ఉండదని తెలిపారు. 3000చదరపు గజాల లోపు స్థలం ఉన్న నోటరైజేడ్ పత్రాలను మాత్రమే అంగీకరించబడతాయని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News