Monday, January 20, 2025

ఇంటర్‌లోనూ దోస్త్?

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : డిగ్రీ తరహాలో ఇం టర్‌లోనూ ఆన్‌లైన్ ప్రవేశాలు చేపట్టేలా ఇంటర్ బో ర్డు కసరత్తు చేస్తోంది. దోస్త్ ద్వారా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు నిర్వహిస్తున్నట్లుగానే జూనియర్ కళాశాలల్లో కూడా ఆన్‌లైన్ విధానంలో ప్రవేశాలు చేపడతామని అధికారులు కొన్నేళ్లుగా చెబుతున్నా, వివిధ కారణాలతో వాయిదా పడుతూనే వస్తోంది. ప్ర స్తు తం రాష్ట్ర ఇంటర్ బోర్డ్ సర్వీసులు ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు అందించే సే వలతో పాటు ప్రైవేట్ కళాశాలలకు అనుబంధ గు ర్తింపు ప్రక్రియ కూడా ఆన్‌లైన్ విధానంలోనే చేపడుతున్నారు. కానీ ప్రధానమైన ప్రవేశాలు సైతం ఆన్‌లైన్‌లో చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామని ఇటీవల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. డిగ్రీ తరహాలో ఇంటర్‌లో కూడా ఆన్‌లైన్ ప్ర వేశాలు చేపడితే కళాశాలలఫీజులు వెబ్‌సైట్‌లో పొం దుపరచాల్సి ఉంటుంది. దాంతో ఆయా కళాశాలల ఆదాయ, వ్యయాలకు అనుగుణంగా ఫీజులు నిర్ణయించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో న్యా యపరమైన అంశాలను, ఇతర అంశాలను పూర్తిగా పరిశీలించి జూనియర్ కాలేజీల్లోనూ ఆన్‌లైన్ ప్రవేశాలు చేపట్టే విధంగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

ఇంటర్ ఫీజులు దిగొచ్చేనా..?
జూనియర్ కళాశాలల్లో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్న పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. ఇంటర్ కోర్సుల ఫీజుల నియంత్రణకు ఇప్పటివరకు ఎలాంటి విధానం లేకపోవడంతో యాజమాన్యాలే ఫీజులు ఖారారు చేసుకుంటున్నాయి. అధిక ఫీజులు వసూలు చేసే కళాశాలలపై ప్రభుత్వం చర్యలు తీసుకున్న దాఖలాలు మాత్రం ఇప్పటివరకు లేవు. దేశంలోనే చాలా రాష్ట్రాల కంటే తెలంగాణ, ఎపి రాష్ట్రాలలోని కార్పోరేట్ జూనియర్ కళాశాలల్లో ఫీజులు అత్యధికంగా ఉన్నాయని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఆదాయ, వ్యయాలకు అనుగుణంగా ఫీజులు ఉండాలి. కానీ ప్రైవేట్ కళాశాలల ఫీజుల్లో ఆదాయానికి, వ్యయానికి ఏమాత్రం పొంతన ఉండటం లేదు.

ఆదాయంలో సగం కూడా వ్యయం ఉండటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఐఐటి, జెఇఇ, నీట్, ఎంసెట్ కోచింగ్ వంటి వివిధ రకాల పేర్లతో ఒక్కో విద్యార్థి నుంచి సుమారు రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు కూడా ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రైవేట్ కళాశాలలకు అనుబంధ గుర్తింపు ప్రక్రియ ఆన్‌లైన్ ద్వారా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫీజుల వసూలు ప్రక్రియ కూడా ఆన్‌లైన్ ద్వారా చేపట్టే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. దాంతో ఆయా కళాశాలల ఆదాయ, వ్యయాలకు అనుగుణంగా ఫీజులు నిర్ణయించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News