Wednesday, January 22, 2025

కెసిఆర్ దూరదృష్టి నిర్ణయంతో సరస్సులకు పునర్జన్మ: సంతోష్ కుమార్

- Advertisement -
- Advertisement -

Reincarnation to Ponds by Mission Kakatiya: Santosh Kumar

మన తెలంగాణ/హైదరాబాద్: అద్భుతం.. అభినందనీయం… సిఎం కెసిఆర్ మిషన్ కాకతీయ పథకాన్ని చేపట్టి చెరువులను పునరుద్ధరించారని ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ అన్నారు. చెరువులనేవి వరదల నియంత్రణ, నదుల సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించారు. సిఎం కెసిఆర్ దూరదృష్టితో కూడిన నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చెరువులు పునర్జన్మ పొందాయని పేర్కొన్న ఎంపి సంతోష్ తద్వారా ప్రకృతి సౌందర్యం తొణికిసలాడుతోందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జంపన్న చెరువు శోభాయమానంగా మారిందని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ట్వీట్‌లో పొందుపర్చారు.

Reincarnation to Ponds by Mission Kakatiya: Santosh Kumar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News