Monday, December 23, 2024

బిజెపి ఎంపి బండి సంజయ్‌కి చుక్కెదురు

- Advertisement -
- Advertisement -
Rejection of Bandi Sanjay Lunch Motion Petition in High Court
హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ తిరస్కరణ

హైదరాబాద్: రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, ఎంపి బండి సంజయ్ హైకోర్టులో మంగళవారం నాడు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను సింగిల్ బెంచ్ తిరస్కరించింది. కరీంనగర్‌లో తనపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలని ఎంపి బండి సంజయ్ పిటిషన్‌లో కోరారు. అదేవిధంగా కరీంనగర్ జుడిషియల్ మెజిస్ట్రేట్ ఇచ్చిన రిమాండ్ ఆర్డర్‌ను క్వాష్ చేయాలని బండి సంజయ్ విన్నవించారు.ఈ పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టాలన్న సంజయ్ అభ్యర్థనను ఉన్నత న్యాయస్థానం అంగీకరించింది.దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ ఎంఎల్‌ఎ, ఎంపిలకు సంబంధించిన కేసుల విచారణకు తనకు రోస్టర్ లేదని పిటిషన్‌ను తిరస్కరించింది. ఎంఎల్‌ఎ , ఎంపిల కేసులు విచారణ జరిపే సంబంధిత కోర్టుకు వెళ్ళాలని బండి సంజయ్ తరపు న్యాయవాదికి సూచించింది. ఈ పిటిషన్‌ను సంబంధిత బెంచ్‌కు బదిలీ చేయాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News