Friday, February 21, 2025

ఢిల్లీ సిఎం రేఖాగుప్తా

- Advertisement -
- Advertisement -

డిప్యూటీ సిఎంగా పర్వేశ్ వర్మ
స్పీకర్‌గా విజయేంద్ర గుప్తా
తొలిసారిగా ఎంఎల్‌ఎగా గెలిచిన
రేఖాగుప్తా అనూహ్యంగా సిఎం
పదవికి ఎంపిక నేటి మధ్యాహ్నం
సిఎంగా ప్రమాణస్వీకారం

న్యూఢిల్లీ : కొత్త ముఖ్యమంత్రి కోసంఢిల్లీ నిరీక్షణ బుధవారం రాత్రి ముగిసింది. ముఖ్యమంత్రి పదవికి రేఖా గుప్తా పేరును భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రకటించింది. మొదటిసారి ఎంఎల్‌ఎ రే ఖా గుప్తా గురువారం మధ్యాహ్నం 12.45 గంటలకు ఢిల్లీలోని చారిత్రక రామ్‌లీలా మైదానంలో సిఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్‌డిఎ పాలిత రాష్ట్రాల సిఎంలతో పాటు బిజెపి అగ్ర నేతలు సిఎం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. రేఖా గుప్తా షాలిమార్ బాగ్ నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థి బందన కుమారిపైన, కాంగ్రెస్ అభ్యర్థి పర్వీన్ కుమార్ జైన్‌పైన గెలిచారు. రేఖా గుప్తా 29595 వోట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ నెల 5న జరిగిన శాసనసభ ఎన్నికల్లో బిజెపి అఖండ విజయం సాధించడంతో మహిళా శాసనసభ్యురాలు ఒకరిని ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎంపిక చేయవచ్చునని పార్టీ వర్గాలు సూచించాయి. మహిళా సభ్యుల్లో రేఖా గుప్తా టాప్ పోటీ దారుగా నిలిచారు. రేఖా గుప్తా ఆప్ నేత ఆతిశీ స్థానంలో సిఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. రేఖా గుప్తా గతంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శిగా పని చేశారు. ఆమె ప్రఖ్యాత ఢిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేశారు.

ఆప్ అధినేత అర్వింద్ కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ వర్మ సిఎం రేసులో ముందు ఉన్నారంటూ వార్తలు వినిపించాయి. అయితే, అనూహ్య రీతిలో బిజెపి అధిష్ఠానం రేఖా గుప్తాను సిఎం పదవికి ఎంపిక చేసింది. బుధవారం సాయంత్రం ఢిల్లీ బిజెపి శాసనసభా పక్ష సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేజ్రీవాల్‌పై విజయంతో పెను సంచలనం సృష్టించిన పర్వేశ్ వర్మను ఉప ముఖ్యమంత్రి పదవి వరించింది. స్పీకర్‌గా విజయేంద్ర గుప్తాను ఎంపిక చేశారు. గురువారం సిఎంతో పాటు ఆరుగురు క్యాబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. బిజెపి 27 సుదీర్ఘ విరామం తరువాత ఢిల్లీలో తిరిగి అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఆప్‌ను ఓడించింది. అసెంబ్లీలోని 70 సీట్లలోకి 48 సీట్లను బిజెపి కైవసం చేసుకున్నది. ఆప్ 22 సీట్లతోసరిపెట్టుకోవలసి వచ్చింది. కాంగ్రెస్‌కు ఈసారి కూడా ఒక్క సీటూ దక్కలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News