Tuesday, November 5, 2024

స్టాక్ మార్కెట్ లో నేడు 15 నిమిషాల్లో రూ. 400 కోట్ల లాభం!

- Advertisement -
- Advertisement -

ముంబై: రేఖా ఝున్‌ఝన్‌వాలా పోర్ట్‌ఫోలియోను రిటైల్ ఇన్వెస్టర్లు క్లోజ్‌గా అనుసరిస్తుంటారు. భారతీయ స్టాక్‌మార్కెట్‌లో స్మార్ట్ మనీ ఎటువైపు కదులుతుందో వారికి దీనివల్ల అర్థమవుతుంటుంది. అలాంటి రిటైల్ ఇన్వెష్టర్లకు రేఖా ఝున్‌ఝున్‌వాలా పోర్ట్‌ఫోలియోలోని టైటాన్ కంపెనీ షేర్లు ఒక్కోటి రూ 150.90కి ట్రేడయ్యాయని, తద్వారా ఆమెకు 6.30 శాతం లాభం చేకూరి రేఖా ఝున్‌ఝున్‌వాలా నెట్‌వర్త్ రూ. 992 కోట్లకు పెరిగిందని అర్థమైంది. ఎల్‌ఐసి దన్నుగా ఉన్న ఈ టాటా గ్రూప్ కంపెనీలో రేఖా ఝున్‌ఝున్‌వాలాకు 5.17 శాతం వాటా లేక 4,58,95,970 షేర్లు ఉన్నాయి.

టైటాన్ షేర్ ధర ఒక్కోటి రూ. 2397.10 నుంచి రూ. 2548.00కి పెరిగింది. షేర్‌హోల్డింగ్ ప్యాటర్న్ ప్రకారం టైటాన్ కంపెనీ లిమిటెడ్‌లో రేఖా ఝున్‌ఝున్‌వాలాకు 4,58,95,970 షేర్లు ఉన్నాయి. నేడు ఆమె 15 నిమిషాల్లోనే రూ. 400 కోట్లు లాభపడ్డారు. ఆమె పోర్ట్‌ఫోలియోలోని టైటాన్, టాటా మోటార్స్ షేర్లు లాభాలతో నేడు మరింత లాభపడ్డారు. స్టాక్‌మార్కెట్‌లో టైటాన్ కంపెనీ షేరు ధర రూ. 2580.20 వద్ద , టాటా మోటార్స్ షేరు ధర రూ. 461.05 వద్ద ముగిసింది. టాటామోటార్స్‌లో రేఖా ఝున్‌ఝున్‌వాలాకు 5.22 కోట్ల షేర్లు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News