Sunday, January 19, 2025

రేఖా ఝుంఝున్ వాలాకు నేడు రూ. 800 కోట్ల నష్టం

- Advertisement -
- Advertisement -

ముంబై: కీశే. రాకేశ్ ఝుంఝున్ వాలా సతీమణి రేఖా ఝుంఝున్ వాలాకు నేడు  రూ. 800 కోట్ల నష్టం(నోషనల్ వ్యాల్యూ) కలిగింది.  టైటాన్ కంపెనీలో ఆమె పెట్టుబడి విలువ భారీగా పతనమైంది. నేడు(మే 06) నాలుగో త్రైమాసిన ఫలితాలు ప్రకటించాక టైటాన్ స్టాక్ విలువ 5 శాతం పతనమయింది.

రేఖా ఝుంఝున్ వాలాకు టాటా గ్రూఫ్ ఫర్మ్ టైటాన్ లో 5.35 శాతం వాటా ఉంది. శుక్రవారం 16792 కోట్లున్న షేర్ల విలువ నేడు రూ. 15986 కోట్లకు పడిపోయింది. అంటే రూ. 805 కోట్ల నష్టం జరిగింది. రేఖా ఝుంఝున్ వాలా ఈ నష్టం నోషనల్ వ్యాల్యూ అని గమనించాలి(అంటే ఆమె షేర్లను అమ్మేసి నష్టపోలేదు).

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News