Sunday, January 19, 2025

కాంగ్రెస్ పార్టీలో చేరిన రేఖానాయక్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఖానాపూర్ ఎంఎల్‌ఎ రేఖా నాయక్ సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత రాత్రి రేఖానాయక్ తన భర్త శ్యామ్ నాయక్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. శ్యామ్ నాయక్‌ను పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఖానాపూర్ నియోజకవర్గంలో రేఖానాయక్‌కు ప్రజల నుంచి వ్యతిరేకత ఉండడంతో నుంచి జాన్సన్ నాయక్‌కు సీటు కేటాయించినట్టు సమాచారం. తనకు సీటు కేటాయించకపోవడంతో బిఆర్‌ఎస్‌పై రేఖా నాయక్ నిప్పులు చెరిగారు. జాన్సన్ నాయక్ అసలు ఎస్‌టినే కాదని మండిపడ్డారు. ఖానాపూర్‌లో తన సత్తా ఏమిటో చూపిస్తానని సిఎం కెసిఆర్ కు సవాల్ విసిరారు. ఎన్నికలకు మూడు నెలల సమయం ఉండడంతో అతి త్వరలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు.

Also Read: కరిచిన పాము… 1300 కిలోమీటర్లు ప్రయాణించి ప్రాణాలు దక్కించుకున్న యువకుడు

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News