Sunday, April 27, 2025

బిఆర్ఎస్ పార్టీకి రేఖానాయక్ రాజీనామా

- Advertisement -
- Advertisement -

ఖానాపూర్ : బిఆర్ఎస్ పార్టీకి ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖా నాయక్ శుక్రవారం రాజీనామా చేశారు. త్వరలోనే ఖానాపూర్ లో పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. కేటిఆర్ ద్రోహాన్ని ప్రజలకు వివరిస్తానని ఆమె పేర్కొన్నారు. బిఆర్ఎస్ అభ్యర్థి ఎస్టీ కాదని రేఖానాయక్ ఆరోపిస్తున్నారు. తన ఫ్రెండ్ కోసం కెటిఆర్ తనకు అన్యాయం చేశారన్నారు. మహిళా సంక్షేమంపై బిఆర్ఎస్ మాట్లాడటం విడ్డూరమని ఆమె పేర్కొన్నారు. ఖానాపూర్ నుండి బరిలో ఉంటానని, తదుపరి కార్యాచరణని త్వరలో ప్రకటిస్తానని రేఖా నాయక్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News