Thursday, January 23, 2025

మంత్రి కెటిఆర్‌పై రేఖానాయక్ షాకింగ్ వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

నిర్మల్ : ఖానాపూర్ బిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని, బిఆర్ఎస్ అభ్యర్థి ఎలా గెలుస్తాడో చూడాలి అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అలాగే కేసీఆర్ తప్పు చేశారని తెలిపారు.

కాగా, శుక్రవారం ఖానాపూర్ లో రేఖానాయక్ మీడియాతో మాట్లాడారు. బిఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నాను. బిఆర్ఎస్ పార్టీలో ఓ మహిళకు అన్యాయం జరిగిందన్నారు. నేను మోసపోయాను. ప్రజలను మోసం చేస్తున్నారు. కెటిఆర్‌ స్నేహితుడైన జాన్సన్‌ నాయక్‌కు టికెట్‌ ఇచ్చారు. నాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నేనేం తప్పు చేశానో చెప్పాలని డిమాండ్ చేశారు. నేను భూములు ఆక్రమించానా?… నిరూపించండి అంటూ మంత్రికి సవాల్ విసిరారు. ఎలాంటి దోపిడీలు చేశారో చెప్పాలన్నారు.

అదే సమయంలో మంత్రి కెటిఆర్ పై ఆమె ఫైర్ అయ్యారు. తన స్నేహితుడు జాన్సన్ కోసం అభివృద్ధి పనులను ఆపేశారని చెప్పారు. ఖానాపూర్ సదర్ మఠాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్మిస్తారని చెప్పారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామన్నారు. అయితే సిఎం తన హామీని తుంగలో తొక్కారని మండిపడ్డారు. తన నియోజకవర్గానికి కేటాయించిన డబుల్ బెడ్‌రూం ఇండ్లను నిర్మల్, బోథ్‌కు తరలించారు. నా నిధులు ఆగిపోయినందున నేను పోరాడబోతున్నాను. ఖానాపూర్‌ను అభివృద్ధి చేయలేదని కెటిఆర్‌ ఒప్పుకున్నారని రేఖానాయక్ వెల్లడించారు.

వచ్చే ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ను ఓడించడమే లక్ష్యమన్నారు. నేను చేసిన మేలు ప్రజలకు చెబుతాను. నా అల్లుడిని అన్యాయంగా బదిలీ చేశారు. బిఆర్‌ఎస్‌ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తానన్నారు. పాదయాత్ర చేస్తానని చెప్పుకొచ్చారు. ఊరు ఊరు తిరుగుతూ ప్రజలను కలుస్తాను. మరి బిఆర్‌ఎస్ అభ్యర్థి ఎలా గెలుస్తారో చూడాలన్నారు. జాన్సన్ ఎస్టీ అభ్యర్థి కాదని కంటతడి పెట్టుకున్నారు. నేను ఇప్పుడు ఏడుస్తున్నా, రాబోయే రోజుల్లో నువ్వు ఏడ్చేస్తావని రేఖానాయక్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News