Monday, December 23, 2024

బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలి

- Advertisement -
- Advertisement -

మహిళా కమిషన్ చీఫ్ డిమాండ్
కల్లోలిత సందేశ్‌ఖలిని సందర్శించిన ఎన్‌సిడబ్లు బృందం

కోల్‌కతా : తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) నేతృత్వంలో జరిగిన అత్యాచారాలకు నిరసనల సమయంలో సందేశ్‌ఖలిలో అసంఖ్యాక మహిళల నోళ్లను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నొక్కుతోందని జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్లు) చైర్‌పర్సన్ రేఖా శర్మ సోమవారం ఆరోపించారు. బెంగాల్‌లో రాష్ట్రపతి విధించాలని రేఖా శర్మ కోరారు. రేఖా శర్మ నేతృత్వంలో కమిషన్ ప్రతినిధివర్గం సోమవారం కల్లోలిత సందేశ్‌ఖలిని సందర్శించింది. చాలా మంది మహిళలు ముందుకు వచ్చి, తమ మనోభావాలను తెలియజేయడానికి వారిలో దృఢవిశ్వాసాన్ని పాదుకొల్పడమే లక్ష్యంగా తాను ఆ ప్రాంతాన్ని సందర్శించానని చెప్పారు. ‘నిజాలు బయటకు రాకుండా చూసేందుకే మహిళల వాణి అణచివేతకు’ మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎన్‌సిడబ్లు చైర్‌పర్సన్ ఆరోపించారు.

‘ఆ ప్రాంతంలో మహిళలతో మాట్లాడిన తరువాత సందేశ్‌ఖలిలో పరిస్థితి భయంకరంగా ఉందని గ్రహించాను. పలువురు మహిళలు తమ ఇక్కట్లు తెలియజేశారు. అక్కడి టిఎంసి పార్టీ కార్యాలయంలో తనపై అత్యాచారం జరిగిందని ఒక మహిళ వెల్లడించింది. బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని మేము కోరుతున్నాం. మా నివేదికలో కూడా అదే విషయం పొందుపరుస్తాం’ అని రేఖా శర్మ ఫోన్‌లో పిటిఐ విలేకరితో చెప్పారు. బిజెపి ప్రభావంతో ఎన్‌సిడబ్లు వ్యవహరిస్తోందన్న టిఎంసి ఆరోపణలపై స్పందన కోరినప్పుడు వ్యాఖ్యానించేందుకు రేఖా శర్మ నిరాకరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News