ఖానాపూర్ ఎమ్మెల్యే విస్తృత పర్యటన
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం
కెసిఆర్ లాంటి నాయకుడు మనకు దొరకడం చాలా అదృష్టం
ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖాశ్యాంనాయక్
మన తెలంగాణ / ఉట్నూర్ రూరల్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ లాంటి నాయకుడు మనకు దొరకడం చాలా అదృష్టం అని ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖా శ్యాం నాయక్ అన్నారు. మండల కేంద్రంతో పాటు మండలంలో మంగళవారం ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖాశ్యాంనాయక్ విస్తృతంగా పర్యాటించారు. మండలంలోని బిర్సాయిపేట గ్రామంలో, మండల కేంద్రంలోని పిఎసిఎస్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, మండల కేంద్రంలోని శాంతినగర్ గ్రామ ఐక్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వరి కోనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అదేవిదంగా మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయం వద్ద సిఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. యాసంగి పంట విషయంలో ప్రతిపక్షాల మాటలువిని రైతులు ఆగం కావద్దని అన్నారు.
టిఆర్ఎస్ ఎప్పుడు రైతుల పక్షాన నిలబడి ఉంటుందని, అన్ని వర్గాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు. గత ప్రభుత్వాలు చేయలేని పనులు మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని పొగిడారు. తెలంగాణ వ్యాప్తంగా పోడు వ్యవసాయ భూముల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ నెల 8 నుండి క్లేమ్స్ తీసుకుంటున్నారని అన్నారు. ఆర్‌ఒఎఫ్‌ఆర్ చట్టం ప్రకారం ప్రతి ఒక్క అర్హులకు పట్టాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపి పంద్ర జైవంత్ రావు, వైస్‌ఎంపిపి బాలాజీ, జిల్లా నాయకుడు శ్రీరామ్ నాయక్, మండల అధ్యక్షులు కందుకూరి రమేష్, రైతు సమన్వమ సమితి అధ్యక్షులు అజీమొద్దిన్, టిఆర్‌ఎస్‌వి జిల్లా అధ్యక్షులు ధరణి రాజేష్, టిఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షులు రాజ్‌కుమార్, బిర్సాయిపేట, లింగోజితాండ సర్పంచ్‌లు కళావతి అంకవ్వ, హరినాయక్, జవ్వాద్ అన్సారి, భరత్, టిఆర్‌ఎస్‌వి మండల అధ్యక్షులు తన్నీరు సతీష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.