Monday, December 23, 2024

చైనాతో బంధం బెలూనుతో దెబ్బతింది: బైడెన్

- Advertisement -
- Advertisement -

హిరోషిమా ః అమెరికా, చైనా మధ్య సంబంధాలను సిగ్గుచేటు బెలూన్ బాగా దెబ్బతీసిందని ప్రెసిడెంట్ బైడెన్ తెలిపారు. ఇప్పటి ప్రతిష్టంభన ఏదో విధంగా వీడుతుందేమో, వేచి చూడాల్సి ఉందని జి 7 సదస్సు నేపథ్యంలో బైడెన్ మాట్లాడారు. తొందర్లోనే సంబంధాలు మెరుగుపడుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. అనుమానిత చైనా స్పై బెలూన్‌ను అమెరికా సేనలు ఈ ఏడాదిలోనే కూల్చివేశాయి. ఫిబ్రవరిలో అమెరికా గగనతలంపై ఎగిరిన అనుమానాస్పద బెలూను అమెరికా నిఘా కార్యక్రమాల్లో భాగం అని భావించి తరువాత దీనిని కూల్చివేయడం దౌత్య సంబంధాలు దెబ్బతినే స్థితికి దారితీసింది. ఇప్పుడు ఇరుదేశాల మధ్య దౌత్య ప్రక్రియకు ఉపకరించే హాట్‌లైన్ నిలిపివేతకు గురైంది. దీనిని పునరుద్ధరించే అవకాశం ఉందని బైడెన్ తెలిపారు.

సైనిక వాడకాలలో ముప్పు నేపథ్యంలో చైనా నుంచి వచ్చే మైక్రోచిప్స్ వంటి వాటిని తెప్పించడం నిలిపివేశారు. పలు విధాలుగా ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బెడిసికొట్టాయి. చైనా నుంచి మైక్రోచిప్స్ నిలిపివేత చర్యను బైడెన్ సమర్థించారు. చైనా పలు ప్రాంతాల్లో వేగు చర్యలకు, సైనిక కార్యకలాపాలకు పాల్పడుతోందని జి 7 దేశాలు ఆందోళన వ్యక్తం చేసిన దశలోనే బైడెన్ ఇరుదేశాల మధ్య సంబంధాలను ప్రస్తావించారు. చైనాతో తాము చేపట్టింది శతృత్వ చర్య కక్షసాధింపు చర్య కాదని కేవలం ఎవరి భద్రతను వారు కాపాడుకోవాలనే ఆలోచనల క్రమంలో అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News