Saturday, January 18, 2025

అసెంబ్లీలో అను”బంధాలు”

- Advertisement -
- Advertisement -

కుటుంబ రాజకీయాల్లో
సరికొత్త మలుపులు

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అసెం బ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కుటుంబ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయి. ఒకే కుటుంబం నుంచి బరిలోకి దిగిన కొందరు విజయం సాధించగా మరికొందరు ఈ ఎన్నికల్లో అవాంతరాలను తప్పించుకోలేకపోయారు.

తండ్రి, కొడుకు, మేనల్లుడు
భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు సిఎం కెసిఆర్ కు టుంబం నుంచి ముగ్గురు అభ్యర్థులు విజయం సాధించారు. గజ్వేల్‌లో సిఎం కెసిఆర్ విజయం సాధించారు. సిరిసిల్లలో బరిలోకి దిగిన బిఆర్‌ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కూడా తన ప్రత్యర్థిపై 30 వేల మెజారిటీతో గెలుపొందారు. కెసిఆర్ మేనల్లుడు హరీష్ రావు కూడా సిద్దిపేటలో భారీ మెజార్టీతో గెలుపొందారు.

ఉత్తమ్, పద్మావతిలు గెలిచారు
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన భార్య పద్మావతి ఇద్దరూ పోటీ చేశారు. వీరిద్దరూ వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. హుజూర్‌నగర్ నుంచి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోదాడ నుంచి ఉత్తమ్ పద్మావతి గెలుపొందారు.

కోమటిరెడ్డి సోదరుల ఘన విజయం
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపిలో చేరి మళ్లీ కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. ఆయన సోదరుడు వెంకట్ రెడ్డి కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. తాజా ఎన్నికల్లో ఈ సోదరులిద్దరూ విజయం సాధించారు. మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి గెలుపొందగా, నల్గొండ నుంచి వెంకట్ రెడ్డి గెలుపొందారు.

కొడుకు గెలుపు, తండ్రి ఓటమి
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన మైనంపల్లి కుటుంబానికి వింత అనుభవం ఎదురైంది. ఈ ఎన్నికల్లో తండ్రీకొడుకులు బరిలోకి దిగిన సంగతి తెలిసిందే. అయితే మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ మెదక్‌లో విజయం సాధించారు.

గడ్డం సోదరులకు ఘన విజయం
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన గడ్డం సోదరులు ఘన విజయం సాధించారు. బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి గడ్డం వినోద్ గెలుపొందగా, చెన్నూరు నియోజకవర్గంలో గడ్డం వివేక్ విజయం సాధించారు.

మామ, అల్లుడు విజయం

ఈ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన మల్లారెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి విజయం సాధించారు. మల్లారెడ్డి మేడ్చల్ నుంచి గెలుపొందగా, ఆయన అల్లుడు మల్కాజిగిరి నుంచి గెలుపొందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News