Wednesday, December 25, 2024

భార్య ఆత్మహత్య… భర్తను హతమార్చిన బంధువులు

- Advertisement -
- Advertisement -

నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం చెన్నంపల్లిలో దారుణం చోటుచేసుకుంది. భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకుంది. వివాహిత మృతి ఘటనలో మృతురాలి తాలూకు బంధువులు భర్తను హత్య చేశారు. మూడేళ్ల క్రితం సింధు, నాగార్జున ప్రేమవివాహం చేసుకున్నారు. వివాహం చేసుకుని అచ్చంపేట నివాసం ఉంటున్నారు. దంపతులు సింధు, నాగార్జున మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.

నిన్న సాయంత్రం సిందు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సింధును రక్షించిన స్థానికులు నాగర్ కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. నాగర్ కర్నూల్ నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా సింధు చనిపోయింది. సింధు మృతదేహాంతో బంధువులు అచ్చంపేటకు తిరుగుపయనం అయ్యారు. భర్త నాగార్జున వల్లే సింధు చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆగ్రహంతో నాగార్జునను కొట్టిచంపారని ఆరోపణలు ఉన్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News