Monday, January 20, 2025

‘ప్రజావాణి’ పున:ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడ్డ ‘ప్రజావాణి’ శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నది. ప్రజావాణి ఇన్ ఛార్జీ, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి. చిన్నా రెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసినందున  ప్రజావాణి అర్జీల స్వీకరణ ప్రతి మంగళ, శుక్రవారాలలో కొనసాగుతుందన్నారు. ఇదిలావుండగా ప్రజావాణి రాష్ట్ర నోడెల్ అధికారిగా రాష్ట్ర మున్సిపల్ డైరెక్టర్ దివ్య వ్యవహరిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News