Thursday, January 23, 2025

బస్తీ దవాఖానా కోసం 55 రోజులుగా రిలే నిరాహార దీక్ష

- Advertisement -
- Advertisement -

తార్నాక: మాణికేశ్వరినగర్‌లో ఆసుపత్రి కోరుతూ బస్తీ వాసులు చేస్తున్న రిలే దీక్షలు ఆదివారం 55వ రోజుకు చేరుకున్నాయి. ఆదివారం దీక్షలో మాణికేశ్వరినగర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు సి. బాలయ్య, అశోక్‌కుమార్, సాయిబాబా విష్ణు, కృష్ణప్రసాద్, వెంకటేశం, ముత్యం, విష్ణు, పవన్, రాజు, శ్రీనివాస్, రవీందర్‌లు రిలే దీక్షలో కూర్చున్నారు. ఈ మేరకు వారికి బిజెపి ఓబిసి మోర్చా మెంబర్ పోచయ్య యాదవ్, బిఆర్‌ఎస్ పార్టీ యూత్ వింగ్ ప్రెసిడెంట్ అలకుంట హరి దీక్షలో పాల్గొన్న వారికి పూలదండలు వేసి తమ సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం సభ్యులు మాట్లాడుతూ దాదాపు 40వేల జనాభా కల్గిన మాణికేశ్వరినగర్‌లో ఆసుపత్రి లేక పోవడం బాధాకరమని తెలిపారు. బస్తీలో ఆసుపత్రి నిర్మించే బస్తీ వాసులు పార్టీలకు అతీతంగా ఐక్యంగా ఉద్యమిస్తామని అన్నారు. బస్తీలో ఆసుపత్రి నిర్మించే వరకు పోరాటం ఆగదని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు గండికోట విజయకుమార్, బిఆర్‌ఎస్ నాయకులు ఓర్సు కృష్ణ, వార్డు మెంబర్ ఓర్సు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News