Wednesday, January 22, 2025

నిధులు విడుదల చేయండి

- Advertisement -
- Advertisement -

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు సిఎం విజ్ఞప్తి

తెలంగాణకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కింద 2019-20, 2021-22 నుంచి 2023-24 వరకు సంవత్సరానికి రూ.450 కోట్ల చొప్పున మొత్తం రూ.1, 800 కోట్లు విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఙప్తి చేశారు.

కేంద్ర మంత్రిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని ఆమె కార్యాలయంలో కలిశారు. 15వ ఆర్థిక సం ఘం నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.2,233.54 కో ట్లు త్వరగా విడుదల చేయాలని కేంద్ర మంత్రిని వారు కోరారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని వారు కేంద్రమంత్రిని విజ్ఞప్తి చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News