Monday, December 23, 2024

స్టాప్ నర్స్ పోస్టుల ప్రాథమిక కీ విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి సంబంధించి ఈ నెల 2వ తేదీన మూడు సెషన్లలో పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీని సోమవారం మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. ప్రాథమిక కీపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే mhsrb.telangana.gov.in వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ విధానంలో నమోదు చేయాలని సూచించింది. 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా 5,204 స్టాఫ్ నర్సుల భర్తీకి రాతపరీక్షలు నిర్వహించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News