జనవరిలో జెఇఇ మెయిన్ తొలి విడత
ఏప్రిల్‌లో రెండో విడత
మే 5న నీట్ యుజి పరీక్ష
మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలో ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ వి ద్యాసంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్(జెఇఇ) 2024, వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించే నీట్‌తోపాటు 2024 -25 విద్యా సంవత్సరానికి సంబంధించి సియుఇటి, యుజిసి నెట్ ప్రవేశ పరీక్షల వార్షిక క్యాలెండర్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌డిఎ) ప్రకటించింది. 2024 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు మొదటి విడ త, ఏప్రిల్ 1 నుంచి 15 రెండో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎన్‌టిఎ వెల్లడించింది. జెఇఇ మెయిన్ పరీక్షలు కంప్యూటర్ ఆధారిత విధానంలో జ గుతాయి.
ఈసారి కూడా గతంలో మాదిరిగానే రెండు విడతల్లో జెఇఇ మెయిన్ నిర్వహించనున్నట్లు ఎన్‌టిఎ తెలిపింది. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజబిలిటీ కమ్ ఎంట్రన్స్ టె స్ట్(నీట్ యుజి) పరీక్ష 2024 మే 5వ తేదీన జరగనుంది.ఈ పరీక్ష పెన్ పేపర్/ఓఎంఆర్ విధానంలో జరుగుతుంది. అలాగే యూనివర్సిటీల యుజి ఉమ్మడి ప్రవేశ పరీక్ష(సియుఇటి యుజి) 2024 మే 15 నుంచి 31 మధ్య జరగనుంది. ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తారు.2024 మార్చి 11 నుంచి 28 మధ్య యూనివర్సిటీల పిజి ఉమ్మ డి ప్రవేశ పరీక్ష (సియుఇటి పిజి) జరగనుంది. 2024 జూన్ 10 నుంచి 21 మధ్య మొదటి విడత యుజిసి నెట్ పరీక్ష జరగనుంది. ఇది కూడా కంప్యూటర్ ఆధారిత పరీక్షే.ఈ పరీక్షలకు సంబంధించిన మరింత సమాచారాన్ని రిజిస్ట్రేషన్లు ప్రారంభించిన సమయంలో అభ్యర్థులకు వెల్లడిస్తామని ఎన్‌టిఎ తెలిపింది. పరీక్షలు జరిగిన మూడు వారాల్లోపే.. కంప్యూటర్ ఆధారంగా జరిగే పరీక్షల ఫలితాలను ప్రకటిస్తామని పేర్కొంది.