Saturday, November 16, 2024

పరిశ్రమల ప్రోత్సాహకాలకు రూ.3736 కోట్లు ఎగనామం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : కొత్త పారిశ్రామిక విధానం పేరిట హడావుడి చేసిన గత ప్రభుత్వం చిన్న మధ్యతరహా పరిశ్రమలకు భారీగా బకాయి ప డింది. దీంతోపాటు అప్పటి ప్రభుత్వం ఇస్తామన్న ప్రోత్సాహకాలు సైతం ఇవ్వకుండా పెండింగ్‌లో పె ట్టడంతో చాలా పరిశ్రమలు మూతపడ్డాయని అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో పేర్కొన్నా రు. మే 20వ తేదీ నాటికి రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలకు దాదాపు రూ.3,736 కోట్ల బకాయిలు ఉండగా వాటిలో రూ.3, 007 కోట్లు చిన్న మధ్య పరిశ్రమలకు సంబంధించినవి కాగా, రూ.728 కోట్లు భారీ, మెగా పరిశ్రమలకు సంబంధించినవని పరిశ్రమల శాఖ అధికారు లు పేర్కొంటున్నారు.గత ప్రభుత్వం పరిశ్రమల రా యితీలు, ప్రోత్సాహకాలకు బడ్జెట్‌లో నిధులు కే టాయించింది. కానీ,
పరిశ్రమలకు నిధులు విడుదల చేయకపోవడంతో పరిశ్రమలను నెలకొల్పుతామని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోవడం, ఇప్పటికే పరిశ్రమలు ఉండి తమ కంపెనీలను విస్తరించాలనుకున్న పరిశ్రమలు మాత్రం అప్పటి ప్రభుత్వం ప్రోత్సాహాకాలను విస్మరించడంతో విస్తరణ అంశాన్ని పక్కన పెట్టాయని అధికారులు పేర్కొంటున్నారు.

రూ.684 కోట్ల విలువైన చెక్కులు సైతం ల్యాప్స్
గతేడాది 2023-,24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొన్ని పరిశ్రమలకు ప్రభుత్వం ఇచ్చిన రూ.684 కోట్ల విలువైన చెక్కులు కూడా ల్యాప్స్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం సిఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పరిశ్రమలను ప్రోత్సహించేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు సరికొత్తగా పాలసీని తయారు చేయాలని ఇప్పటికే పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించారు.

ఆరు కొత్త విధానాలతో సరికొత్త పాలసీ…
రెండు రోజుల క్రితం ఆయన ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించి రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి అనుసరించాల్సిన నూతన పారిశ్రామిక విధానం కోసం పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో జౌళి పరిశ్రమను ప్రోత్సహించేందుకు పవర్ లూమ్, చేనేత కార్మికులకు మేలు జరిగేలా కొత్త విధానాన్ని రూపొందించాలని రెడ్డి అధికారులకు సూచించారు. అందులో భాగంగా పారిశ్రామికాభివృద్ధికి ప్రధానంగా ఎంఎస్‌ఎంఈ పాలసీ, ఎగుమతి విధానం, కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీ, రివైజ్డ్ ఈవీ పాలసీ, మెడికల్ టూరిజం పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ అనే ఆరు కొత్త విధానాలను రూపొందించనున్నట్లు అధికారులు ముఖ్యమంత్రితో పేర్కొనడంతో ఆ దిశగా అధ్యయనం చేయాలని సిఎం అధికారులకు సూచించారు.

పేదల నుంచి బలవంతంగా భూములు తీసుకున్న గత ప్రభుత్వం….
అయితే గత ప్రభుత్వం 2014- నుంచి 20-23ల మధ్య 35,581 ఎకరాల భూమిలో 109 ఇండస్ట్రీయల్ పార్కులు ఏర్పాటు చేశామని పేర్కొంటున్నా, ఆ భూమిలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయన్న విషయంలో స్పష్టత కరువయ్యిందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే 2022, –23 సంవత్సరంలో టిఎస్‌ఐఐసి 8,560 ఎకరాల్లో 19 కొత్త పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేశామని నివేదించింది. ఆ భూమిని పేదల నుంచి బలవంతంగా తీసుకొని పెద్దలకు అంటగట్టారని భారీగా ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో కొన్నిచోట్ల కంపెనీలు పనులు ప్రారంభించకపోవడం విశేషం.

9 ఫార్మా పరిశ్రమల క్లస్టర్లు ఏర్పాటుకు సిఎం చొరవ
గత ప్రభుత్వంలో ఏర్పాటైన పలు కంపెనీల్లో చాలా పరిశ్రమల నుంచి కాలుష్యం అధికమయ్యిందని పిసిబి సైతం పేర్కొంటుంది. ఈ నేపథ్యంలోనే చాలా కంపెనీలను ‘రెడ్’ కేటగిరీ కింద పిసిబి అధికారులు పరిగణిస్తున్నారు. గత ప్రభుత్వం రెడ్ కేటగిరి పరిశ్రమలను ఔటర్‌కు అవతకు తరలిస్తామని హామీఇచ్చి దానిని విస్మరించిన రెడ్ కేటగిరి పరిధిలో నివసిస్తున్న ప్రజలు సైతం ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రింగ్ రోడ్డు అవతల 9 ఫార్మా పరిశ్రమల క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించి ప్రజల్లో నూతన ఉత్సాహాన్ని ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News