Monday, December 23, 2024

ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

Release of Inter Supplementary Results

ఉదయం సెకండియర్, సాయంత్రం ఫస్టియర్
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడదుల
మొదటి సంవత్సరంలో 67.72 శాతం,
రెండో సంవత్సరంలో 47.74 శాతం ఉత్తీర్ణత
– ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేసిన
ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్
ఎంసెట్ కౌన్సిలింగ్ దృష్టా ఉదయం
కేవలం సెకండియర్ ఫలితాలు వెల్లడి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ఇంటర్మీడియేట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడులయ్యాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలను మంగళవారం ఉదయం ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ విడుదల చేయగా, సాయంత్రం మొదటి సంవత్సరం ఫలితాలు నేరుగా వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఈ పరీక్షలకు రెండో సంవత్సరంలో జనరల్‌లో 1,02,236 మంది విద్యార్థులు హాజరు కాగా, 48,816 మంది(47.74 శాతం) ఉత్తీర్ణత సాధించారని సెక్రటరీ ఉమర్ జలీల్ పేర్కొన్నారు. అలాగే ఒకేషనల్‌లో 12,053 మంది హాజరుకాగా, 7,843 మంది(65.07 శాతం) ఉత్తీర్ణులయ్యారని అన్నారు. ద్వితీయ సంవత్సరంలో ఉత్తీర్ణతలో ములుగు జిల్లా మొదటి స్థానం నిలువగా, వికారాబాద్ చివరి స్థానంలో నిలిచిందని తెలిపారు. ఎంసెట్ కౌన్సిలింగ్ దృష్టా కేవలం ద్వితీయ ఇంటర్ ఫలితాలు మాత్రం ఉదయం విడుదల చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

ప్రథమ సంవత్సరంలో 67.72 శాతం ఉత్తీర్ణత

ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలలో మొదటి సంవత్సరం జనరల్‌లో 67.72 శాతం ఉత్తీర్ణత నమోదైంది. జనరల్‌లో 2,20,456 మంది విద్యార్థులు హాజరుకాగా, 1,49,285 మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే ఒకేషనల్‌లో 18,955 మంది విద్యార్థులు హాజరుకాగా, 10,858 మంది (57.28 శాతం) ఉత్తీర్ణులయ్యారు.

వచ్చే నెల 8లోగా రీకౌంటింగ్‌కు ఫీజు చెల్లించాలి

ఇంటర్ మార్కుల రీ కౌంటింగ్, జవాబుపత్రాల రీ వెరిఫికేషన్ కోసం వచ్చే నెల 5 నుంచి 8 వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలి. రీ కౌంటింగ్‌కు ఒక్కో పేపర్‌కు రూ.100, స్కాన్ చేసిన జవాబు పత్రాలు, రీ వెరిఫికేషన్ కోసం ఒక్కో పేపర్‌కు రూ.600 చెల్లించాలి. www.tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లో స్టూడెంట్ ఆన్‌లైన్ సర్వీసెస్ ద్వారా రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు విద్యార్థులు ఫీజు చెల్లించాలి.

ఇంటర్ మొదటి సంవత్సరం(జనరల్)

పరీక్షకు హాజరైన విద్యార్థులు: 2,20,456

ఉత్తీర్ణత సాధించినవారు: 1,49,285

ఉత్తీర్ణత శాతం: 67.72 శాతం

పరీక్షకు హాజరైన అమ్మాయిలు: 98,168

ఉత్తీర్ణత సాధించినవారు: 5,841

ఉత్తీర్ణత శాతం: 61.56 శాతం

పరీక్షకు హాజరైన అబ్బాయిలు: 1,22,288

ఉత్తీర్ణత సాధించినవారు: 75,237

ఉత్తీర్ణత శాతం: 61.56 శాతం

ఇంటర్ ద్వితీయ సంవత్సరం..

పరీక్షకు హాజరైన విద్యార్థులు: 1,02,236

ఉత్తీర్ణత సాధించినవారు: 48,816

ఉత్తీర్ణత శాతం: 47.74 శాతం

పరీక్షకు హాజరైన అమ్మాయిలు: 36,995

ఉత్తీర్ణత సాధించినవారు: 19,828

ఉత్తీర్ణత శాతం: 53.59 శాతం

పరీక్షకు హాజరైన అబ్బాయిలు: 65,241

ఉత్తీర్ణత సాధించినవారు: 28,988

ఉత్తీర్ణత శాతం: 44.43 శాతం

ఒత్తిడి నివారణకు సైకాలజిస్టుల సేవలు

ఇంటర్ ఫలితాల నేపథ్యంలో విద్యార్థుల మానసిక ఒత్తిడి నివారణకు ఇంటర్ బోర్డు ఏడుగురు క్లినికల్ సైకాలజిస్టులను నియమించింది. మానసిక ఒత్తిడికి లోనయ్యే విద్యార్థులు 18005999333 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి సైకాలజిస్టుల సేవలు పొందవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News