Monday, December 23, 2024

వెబ్‌సైట్‌లో జెఇఇ మెయిన్ అడ్మిట్ కార్డులు

- Advertisement -
- Advertisement -

Release of JEE Mains Exam 2022 Admit Card

23 నుంచి 29 వరకు మొదటి సెషన్ పరీక్షలు
రెండు రోజుల ముందు అడ్మిట్ కార్డులు విడుదల
చేయడం పట్ల వెల్లువెత్తిన విమర్శలు

మనతెలంగాణ/హైదరాబాద్ : జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జెఇఇ) మెయిన్ మొదటి విడత పరీక్షల అడ్మిట్ కార్డులు ఎట్టకేలకు విడుదల అయ్యాయి. సాధారణంగా ప్రవేశ పరీక్షలకు వారం పది రోజుల ముందు హాల్‌టికెట్లు జారీ చేయడం ఆనవాయితీ. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ నెల 23 నుంచి 29 వరకు జెఇఇ మెయిన్ మొదటి విడత పరీక్షలు జరగనుండగా, మంగళవారం అంటే కేవలం రెండు రోజుల ముందే ఎన్‌టిఎ హాల్‌టికెట్లు జారీ చేయడం పట్ల విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 501 నగరాలతో పాటు ఇతర దేశాల్లో 21 నగరాల్లో పరీక్ష నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు చేసింది. రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలు పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులు తమకు కొవిడ్ లక్షణాలు లేవని విద్యార్థులు స్వీయ ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది.

ఎన్‌టిఎ తీరుపై విద్యార్థుల అసహనం

కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని నెలకొల్పిన నాటి నుంచి పరీక్షల తేదీలు, నోటిఫికేషన్లు, ఫలితాలు వెల్లడిలో విద్యార్థులను అయోమయానికి గురిచేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ఇదివరకే ముందుగా ప్రకటించిన జెఇఇ మెయిన్ షెడ్యూల్‌లో మార్పులు చేసిన ఎన్‌టిఎ ఇటీవల మరోసారి మార్పులు చేసింది. జూన్ 21 నుంచి జెఇఇ మెయిన్ తొలి విడత పరీక్షలు మొదలవుతాయని గతంలో ప్రకటించిన ఎన్‌టిఎ .. మూడు రోజుల క్రితం ఈ నెల 23 నుంచి పరీక్షలు అంటూ ప్రకటించి విద్యార్థులను అయోమయానికి గురిచేసింది. నాలుగు రోజుల క్రితం విద్యార్థులకు ఏ నగరంలో పరీక్షల నిర్వహిస్తారో అనే విషయాన్ని తెలుసుకునేందుకు స్లిప్పులు డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.

అందులో పరీక్షా కేంద్రం వివరాలు ఉండవు. పరీక్షా కేంద్రం లేకుండా డౌన్‌లోడ్ చేసుకున్న స్లిప్పులతో విద్యార్థులు అయోమయానికి లోనయ్యారు. పరీక్షల తేదీ సమీపిస్తున్నా అడ్మిట్ కార్డులు జారీ కాకపోవడం పట్ల దేశవ్యాప్తంగా విద్యార్థుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఎన్‌టిఎ మంగళవారం అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌లో ఏవైనా సమస్యలు ఉంటే 011 – 40759000 ఫోన్ లేదా jeemain@nta.ac.in మెయిల్ ద్వారా సంప్రదించాలని ఎన్‌టిఎ తెలిపింది. రెండు రోజుల్లో పరీక్షలు ప్రారంభం కానుండగా… మంగళవారం ఉదయం వరకు అడ్మిట్ కార్డులను విడుదల చేయకపోవడంపై ఎన్‌టిఎ తీరుపై విద్యార్థులు అసహనం వ్యక్తం చేశారు.

అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకునే విధానం

తొలుత jeemain.nta.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

అడ్మిట్ కార్డు లింక్‌ను క్లిక్ చేయాలి.

విద్యార్థి రిజస్టర్డ్ ఐడీ, పుట్టిన తేదీతో లాగిన్ అవ్వాలి.

జెఇఇ మెయిన్ అడ్మిట్ కార్డు స్ట్రీన్‌పై కనబడుతుంది.

ఆ తర్వాత దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కార్డుపై విద్యార్థి పరీక్ష రాసే నగరం, ఇతర వివరాలన్నీ ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి. ఏవైనా సమస్యలు ఉంటే 011 – 40759000 ఫోన్ లేదా jeemain@nta.ac.in మెయిల్ ద్వారా ఎన్‌టిఎ అధికారులను సంప్రదించాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News