Saturday, November 16, 2024

జెఈఈ మెయిన్స్‌ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

Release of JEE Mains‌ Results

 

న్యూఢిల్లీ: జెఈఈ మెయిన్స్ నాలుగో విడత ఫలితాలను మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ  ప్రకటించింది. ఇందులో దేశవ్యాప్తంగా 44మంది అభ్యర్థులు 100 పర్సంటైల్ సాధించగా, వారిలో 18 మంది విద్యార్థులకు మొదటి ర్యాంకు వచ్చింది. వీరిలో తెలంగాణకు చెందిన ఇద్దరు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు ఉండటం విశేషం. మొత్తం 9,34,602 మంది విద్యార్థులు మెయిన్స్‌ పరీక్ష రాశారు. రాష్ట్రానికి చెందిన కొమ్మ శ‌ర‌ణ్య‌, జోస్యూల వెంకట ఆదిత్య ఫస్ట్‌ ర్యాంకు సాధించగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దుగ్గినేని వెంక‌ట‌ ప‌నీష్‌, ప‌స‌ల వీర‌శివ‌, కుంచ‌న‌ప‌ల్లి రాహుల్ నాయుడు, కరణం లోకేష్ మొదటి ర్యాంక్‌ సాధించిన వారిలో ఉన్నారు. జేఈఈ మెయిన్ నాలుగో విడుత పరీక్షను ఆగస్టు​ 26, 27, 31, సెప్టెంబర్​ 1, 2 తేదీల్లో నిర్వహించారు. ఈ పరీక్షను దేశవ్యాప్తంగా 334 కేంద్రాల్లో 13 భాషల్లో (తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ, గుజరాతి, అస్సామీస్‌, బెంగాలి, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడిశా, పంజాబీ, తమిళం) నిర్వహించారు. ఈ పరీక్ష ద్వారా ఎన్‌ఐటీ, ఐఐఐటీలతోపాటు కేంద్ర నిధులతో నడుస్తున్న సాంకేతిక విద్యా సంస్థల్లో బీఈ, బీటెక్‌, బీఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ఫలితాల కోసం:
విద్యార్థులు ముందు jeemain.nta.nic.in వెబ్‌సైట్​లోకి లాగిన్ అవ్వాలి. తరువాత హోమ్‌పేజీలో కనిపించే జేఈఈ మెయిన్స్​ రిజల్ట్​ లింక్‌పై క్లిక్ చేయండి. మీ లాగిన్ వివరాలను నమోదు చేయండి. సబ్​మిట్​ చేసి మీ రిజల్ట్​ చెక్​ చేసుకోండి. జేఈఈ మెయిన్​ ఫలితాల కోసం jeemain.nta.nic.in, nta.ac.in, nta.nic.in, Ntaresults.nic.in వెబ్​సైట్లను సందర్శించండి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News