Wednesday, January 22, 2025

పిఈ సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

- Advertisement -
- Advertisement -

Release of PE cet Counseling Schedule

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వ్యాయామ విద్య కోర్సుల ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారయ్యింది. శనివారం పిఈ సెట్ అడ్మిషన్ కమిటి ఉన్నత విద్యామండలి ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి అధ్యక్షతన సమావేశమయ్యింది. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి కార్యదర్శి డా. ఎ న్. శ్రీనివాస్ రావు, పిఈ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పి. రమేష్ బాబు, ఇతర కమిటి సభ్యులు హాజరయ్యారు. ఈ సమవేశంలో కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు చేశారు. 18న ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ అవుతుంది. ఈ నెల 19 నుం చి 26 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ధృవపత్రాలు పరిశీలిన ఉంటుందని అధికారులు తెలిపారు. 26, 27 తేదీల్లో స్పెషల్ క్యాటగిరి వారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. 28న అర్హులైన అభ్యర్థుల జాబితాను ప్రదర్శిస్తారు. ఈ నెల 29, 30 తేదీల్లో పిఈ సెట్ వెబ్ ఆప్షన్లకు అవకాశం క ల్పించారు. 31న వెబ్ ఆప్షన్ల ఎడిట్‌కు అవకాశం కల్పించారు. నవంబర్ 2న ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. నవంబర్ 3 నుంచి 11 వరకు ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం సంబంధిత కాలేజీలకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News