Wednesday, January 22, 2025

మార్కెట్‌లో స్వచ్చమైన తేనే “గిరి నేచర్‌” విడుదల

- Advertisement -
- Advertisement -

Release of pure honey Giri Nature in market

గిరిజన సహకార సంస్థకు సిఎస్ అభినందనలు

హైదరాబాద్ : స్వచ్ఛమైన తేనే “ గిరి నేచర్‌” ను తెలంగాణ గిరిజన సహకార సంస్థ మార్కెట్‌లోకి విడుదల చేసింది. రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల నుండి నేరుగా గిరిజనులు సేకరించిన పుట్టు తేనేను ఏ మాత్రం రసాయనాలతో ప్రాసెస్ చేయకుండా నేరుగా స్వచ్ఛమైన తేనే విక్రయాలను గిరి నేచర్ పేరుతో తెలంగాణ గిరిజన సహకార సంస్థ ప్రారంభించింది. ఈ గిరిజన తేనే ఉత్పత్తులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్టూ అందజేశారు. ఈ తేనే ఉత్పత్తుల్లో మొదటి సారిగా మామిడి తేనే, వేప తేనే, నువ్వుల తేనే, పాల కొడిశ తేనే లను వేర్వేరుగా విక్రయిస్తోంది. రాష్ట్రంలో ప్లిప్ కార్డు, క్యూ మార్ట్‌ల ద్వారా ఈ తేనే ఉత్పత్తులను నేరుగా కొనుగోలు చేయవచ్చని క్రిస్టినా చోంగ్టూ తెలిపారు. ఇప్పటివరకు గిరిజనులను ముఖ్యంగా చెంచు గిరిజనులు కిలో తేనే కు రూ.220లు పొందే వారని, దీనితో 54 శాతం అదనపు ఆదాయాన్ని పొందుతారని సిఎస్‌కు వివరించారు.

కాగా గిరిజనుల ఆదాయాన్ని పెంపొందించడమే కాకుండా ప్రజలకు మరింత స్వచ్ఛమైన తేనే ఉత్పత్తులను అందుబాటులో తేవడం పట్ల గిరిజన సహకార సంస్థను అభినందించారు. అడవుల్లో సేకరించిన ఈ మామిడి తేనే, వేప తేనే, నువ్వుల తేనే, పాల కొడిశ తేనే రకాల వేర్వేరు తేనే ఉత్పత్తులను ఏ విధమైన రసాయనాలతో ప్రాసెస్ చేయకుండా స్వచ్ఛమైన ఉత్పత్తులను అదేవిధంగా ప్రజలకు అందుబాటులో తేవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్యపరమైన లాభాలుంటాయన్నారు. ఈ తేనేలు పాలీఫెనాల్స్ అని పిలువబడే విభిన్న బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటాయన్నారు. ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు, యాంటి యాంటీప్లమేటరి, యాంటీమైక్రోబయల్, రోగనిరోధక శక్తిని పెంచే ప్రభావాన్ని కలిగి ఉంటాయని పేర్కొన్నారు. జలుబు, గొంతునొప్పి, చర్మ వ్యాధుల నివారణకు తేనే మంచి ఔషధంగా పనిచేస్తుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News