Friday, December 20, 2024

గ్రానైట్ పరిశ్రమలకు రూ.22 కోట్ల బకాయిలు విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఖమ్మం గ్రానైట్ పరిశ్రమలకు ప్రభుత్వం బకాయి ఉన్న పలు సబ్సిడీలను శనివారం విడుదల చేసింది. ఇండస్ట్రీస్ ఇన్సెంటివ్, పవర్ సబ్సిడీ, పావలావడ్డీ బకాయిలు కలిపి.. ప్రభుత్వం రూ. 22 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రానైట్ పరిశ్రమకు ప్రభుత్వం నుంచి 2014 నుంచి పలు రకాల రాయితీ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని విడుదల చేసి పరిశ్రమను ఆదుకోవాలని ఖమ్మం గ్రానైట్ అసోసియేషన్ ప్రతినిధులు రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర నేతృత్వంలో పలుమార్లు ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులు కెటిఆర్, హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్‌లను కోరారు.

ఈ మేరకు బకాయిల మొత్తంలో రూ. 22 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రానైట్ పరిశ్రమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పలు రాయితీ బకాయిలు మంజూరైన నేపధ్యంలో రాజ్యసభ ఎంపి వద్దిరాజు రవిచంద్ర హర్షం వ్యక్తం చేశారు. ఖమ్మం గ్రానైట్ కుటుంబ సభ్యులందరూ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు రుణపడి ఉంటారని అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News