Monday, December 23, 2024

సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల రెండో మెరిట్ జాబితా విడుదల

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ నియామకాలలో భాగంగా మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు రెండో ప్రొవిజినల్ మెరిట్ జాబితాను విడుదల చేసింది. అభ్యర్థుల అభ్యంతరాలు పరిశీలించి మెరిట్ జాబితాను ప్రకటించింది.

ఈ నెల 22 నుంచి 25 వరకు వెంగళరావు నగర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో కేటగిరీల వారీగా 1: 2 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు బోర్డు సభ్య కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు షార్ట్ లిస్టు అయిన అభ్యర్థుల జాబితాను వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో ధృవపత్రాల పరిశీలనకు హాజరుకావాలని తెలిపారు. ఇతర వివరాలకు www.mhsrd.telangana.gov.in వెబ్‌సైట్ చూడాలని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News