Saturday, November 16, 2024

కానిస్టేబుల్ ప్రాధమిక పరీక్ష ‘కీ’ విడుదల

- Advertisement -
- Advertisement -

Release of TS Constable Primary Exam 'Key'

మనతెలంగాణ/హైదరాబాద్ : ఈనెల 28న నిర్వహించిన కానిస్టేబుల్ ప్రాధమిక పరీక్షకు సంబంధించిన ‘కీ’ని విడుదల చేసిన అధికారులు మంగళవారం నాడు రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. కాగా ప్రాధమిక కీ కోసం www.tslprb.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని, అలాగే ఈ నెల 31వ తేదీ ఉదయం 8 గంటల నుంచి సెప్టెంబర్ 2వ తేదీ సాయంత్రం 5 గంగల వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నామని పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్దు అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సివిల్, ట్రాన్స్‌పోర్టు, ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఈనెల 28(ఆదివారం) పరీక్షలు నిర్వహించిన విషయం విదితమే. సివిల్ ఇతర విభాగాల్లో 15,644, రవాణాశాఖలో 63, ఎక్సైజ్‌శాఖలో 614 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నియామకానికి గత ఏప్రిల్‌లో నోటిషికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆయా పోస్టులకు 6,61,196 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోగా 6,03,955 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈనెల 28న నిర్వహించిన కానిస్టేబుల్ ప్రాధమిక పరీక్షకు 91.34 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు టిఎస్‌ఎల్‌పిఆర్‌బి ఒక ప్రకటనలో పేర్కొంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News