Wednesday, January 22, 2025

పెంటోని చెరువు నుంచి నీటి విడుదల

- Advertisement -
- Advertisement -

బిజినేపల్లి రూరల్ ః మండల పరిధిలోని పాలెం పెంటోని చెరువులో బుధవారం ఎంపిపి పుప్పాల శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ గోవిందు లావణ్య నాగరాజులు వానాకాలం దృష్టా రైతులు పంటలు పండించుకునేందుకు చెరువు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతే రాజు అనే నినాదంతో రైతు సంక్షేమమే ధ్యేయంగా మిషన్ కాకతీయ ద్వారా గ్రామంలోని చెరువును నీటితో నింపి దాదాపు వెయ్యి ఎకరాల పంటలను రైతులు పండించేందుకు వీలు కల్పించిన నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో లింగసానిపల్లి సర్పంచ్ బోనాసి సుగుణమ్మ, లక్ష్మయ్య, ఉప సర్పంచ్ చిక్కొండ్ర రాములు, రైతు సంఘం సమన్వయ సమితి కమిషనర్ బుర్రి యాదవ రెడ్డి, పంచాయతి కార్యదర్శి చిన్న బీరయ్య, వార్డు మెంబర్లు ఐల రవీందర్ రెడ్డి, సొప్పరి రాములు, మాడుగుల స్వామి, గడ్డం సంధ్యా శ్రీనివాసులు, దండు అరుణ శంకర్, బిఆర్‌ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు గోవిందు శ్రీనివాసులు, బుర్రి సుదర్శన్ రెడ్డి, కారువంగ దశరథం, శివ కుమార్, కృష్ణయ్య, ఆంజనేయులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News