Monday, December 23, 2024

రూ. 1350 కోట్లు విడుదల చేయండి

- Advertisement -
- Advertisement -
విభజన చట్టం ప్రకారం మూడేళ్ల బకాయిలు రావాల్సి ఉంది
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు వినతిపత్రం
జిఎస్‌టి 50వ కౌన్సిల్ సమావేశానికి హాజరైన మంత్రి
ఐజిఎస్‌టి నిధుల అంశాన్ని పరిష్కరించాలని సూచన
హరీశ్‌రావు ప్రతిపాదనకు సానుకూల స్పందన
అధికారులతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం

మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణకు రావాల్సిన ఐజీఎస్టీ ఫండ్స్ ఇతర రా ష్ట్రాలకు చెల్లించిన అంశాన్ని పరిష్కరించాలని చాలా కాలంగా అడుగుతున్నా కొలిక్కిరా లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం ఢిల్లీ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన 50వ జీఎస్టీ కౌ న్సిల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలను ప్రస్తావించారు. దాదాపు రూ. 700 కోట్లు జీఎస్‌ఓ సెస్, ఐజీఎస్టీ రూ. 120 కోట్లు విడుదల చేయాలని కోరినట్లు మంత్రి తెలిపారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి తెలంగాణలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ని ధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్రకు చెందిన పన్ను చెల్లింపదారుడు రూ. 82 కోట్లు తెలంగాణకు చెల్లించాల్సి ఉన్నది. రీఫండ్ రాగానే చెల్లిస్తామని అతను క్లారిటీ ఇచ్చారు. కానీ పెండింగ్‌లోనే ఉందని గుర్తుచేశారు. 47వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలోనే దీనిని లేవనెత్తాం. ఆఫీసర్లతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు హామీ లభించింది. కానీ కార్యరూపం దాల్చలేదన్నారు. ఇలాంటి అంశాలను సత్వరం పరిష్కరించేందుకు గతంలో హా మీ ఇచ్చినట్లుగా ఆఫీసర్ల బృందాన్ని ఏర్పాటు చే యాలన్న హరీశ్‌రావు ప్రతిపాదనకు కేంద్ర ఆర్థిక మంత్రి సానుకూలంగా స్పందించా రు. 47వ జీ ఎస్టీ కౌన్సిల్ మీటింగులో చర్చించుకున్నట్లుగా ఆఫీసర్లతో కూడిన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. -ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చ ట్టం ప్రకారం మూడేళ్లకు కలిపి రూ.1350 కోట్లు విడుదల కాలేదని, వెంటనే విడుదల చేయాలని వినతిపత్రం ఇచ్చినట్టు హరీశ్‌రావు చెప్పారు.జీఎస్టీని పిఎంఎల్‌ఏ చట్టం కిందకి తీసుకురావడంపై స్పష్టత ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.
కృష్ణా జలాల పంపిణీకి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయండి
కృష్ణా జలాల పంపిణీ విషయంలో వెంటనే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను కలిసిన కోరినట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ హరీశ్‌రావు తెలిపారు. ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న అనంతరం కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను హరీశ్‌రావు కలిశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ నూతన కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు, నీటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై చర్చించినట్లు తెలిపారు. గతంలో కేంద్రం ఇచ్చిన హామీ మేరకు సుప్రీంకోర్టులో కేసును విత్ డ్రా చేసుకున్నాం.. సెక్షన్ 3 కింద కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి దరఖాస్తు చేశాం.. రెండేళ్లయిన నిర్ణయం తీసుకోలేదు. కృష్ణా జలాల పంపిణీ విషయంలో వెంటనే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరామని వెల్లడించారు. గతంలో సిఎం కెసిఆర్ అపెక్స్ కమిటీ సమావేశానికి వచ్చిన సందర్భంలో సుప్రీంకోర్టులో కేసు విత్ డ్రా చేసుకోవాలని కోరడంతో ప్రభుత్వం కేసును వెనక్కి తీసుకుందన్నారు. గోదావరిలో పెండింగ్ ప్రాజెక్టులకు సిడబ్ల్యుసి అనుమతులు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. సమ్మక్క బ్యారేజ్, సీతారామ, 3వ టిఎంసికి క్లియరెన్స్ ఇవ్వాలని,పాలమూరు ఎత్తిపోతల పథకంలో 90 టిఎంసిల నికర జలాలతో ఆ ప్రాజెక్టుకు క్లియరెన్స్ ఇవ్వాలని కోరాం తెలిపారు. పోలవరం కాలువ సైజ్ పెంచడం వల్ల తెలంగాణ వాటాకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ ఏడాది కృష్ణా నీళ్లలో తెలంగాణ, ఎపికి 50 శాతం నీళ్లు ఇవ్వాలని కోరినట్లు వెల్లడించారు. మాట ఇచ్చిన విధంగా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ చెప్పారని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News