Thursday, February 20, 2025

కృష్ణాజలాల్లో ఎపి ఏకపక్ష వినియోగంపై కేంద్రానికి ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

కృష్ణాజలాల్లో వాటాల పంపిణీ, లెక్కింపు బాధ్యత కేంద్రానిదే తన
వాటా మించి ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా నీటిని తరలించకుండా చూసే
బాధ్యత కూడా కేంద్రానిదే ఎక్కువ నీటిని తరలించకుండా ఎపిని
టెలీమెట్రీతో అడ్డుకోవచ్చు రెండు రాష్ట్రాల నీటి లెక్కలకు టెలీమెట్రీనే
పరిష్కారం టెలీమెట్రీకి అవసరమైన సగం నిధులు మనమే
సమకూర్చుదాం వెంటనే టెలీమెట్రీ అమలు చర్యలు తీసుకోవాలి ఆ
మేరకు కెఆర్‌ఎంబికి లేఖ రాయాలని ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జాకు
సిఎం ఆదేశం ప్రాజెక్టుల కింద సాగవుతున్న పంటలకు ప్రణాళిక
మేరకు నీరు విడుదల చేయాలని సూచన పంటలు ఎండిపోకుండా
జాగ్రత్త పడాలని హితవు రాబోయే మూడు నెలలు అప్రమత్తంగా
ఉండాలని అధికారులకు హెచ్చరిక అధికారులు క్షేత్రస్థాయిలో
పర్యటించాలని ఆదేశాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి కృ ష్ణాజలాలను సద్వినియోగం చేసుకునే విషయంలో రాష్ట్ర యంత్రాం గం అత్యంత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ప ష్టం చేశారు. ఏకపక్షంగా ఏపీ ప్రభుత్వం నీటిని తరలింపు అంశంపై వెంటనే కేంద్రానికి ఫిర్యాదు చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డిని ఆయన ఆదేశించారు. నిర్ణీత కోటాకు మించి కృష్ణాజలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువ నీటిని తీసుకోకుండా నిరోధించాలన్నారు. నిర్ణీత వాటా కంటే ఏపీ ఎక్కువ నీటిని తరలించకుండా చూసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని వ్యాఖ్యానించారు.

వేసవి తీవ్రత అంచనాలతో..
వచ్చే వేసవి తీవ్రతను బట్టి సాగు, తాగునీటి సరఫరాలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సాగునీటిపారుదల శాఖ అ ధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయి పర్యటనలతో పరిస్థితులను అంచనవేసి వాటికనుగుణంగా పరిష్కార మార్గాలను ఎంచుకోవాలని నిర్దేశించారు. సోమవారం రాష్ట్రంలో ప్రాజెక్టులలో నీ టి నిల్వలు, పంటలకు సాగు నీటి విడుదల అంశాలపై సీఎం సంబంధిత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, చీఫ్ సెక్రెటరీ శాంతికుమారి, నీటిపారుదల సలహాదారులు అదిత్యనాద్‌దాస్, సీఎం ముఖ్యకార్యదర్శి మనిక్‌రాజ్ కన్నన్ తదితరులతో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చే మూడు నెలలు అత్యంత కీలకమని, రాష్ట్రమంతటా అన్ని చోట్ల సాగునీరు, తాగు నీరు. విద్యుత్తు డిమాండ్ గణనీయంగా పెరిగే అవకాశం ఉందని, నీటిపారుదల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

టెలిమెట్రీ విధానమే పరిష్కారం
కృష్ణాజలాల వాటాల వినియోగంలో వివాదాలకు ఆస్కారం లేకుండా ఉండేందుకు టెలిమెట్రీ విధానమే శ్రేయస్కారమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. కృష్ణా జలాల నీటి వాటాల పంపిణీ, నీటి వాటాల వినియోగాన్ని లెక్కించే బాధ్యత కేంద్ర జల సంఘంపైనే ఉందని సీఎం గుర్తు చేశారు. అయితే టెలీమెట్రీ విధానం అమలుకు అయ్యే ఖర్చులో సగం నిధులను ముందుగా మన ప్రభుత్వమే చెల్లిస్తుందని అధికారులు తెలిపారు. కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెలీమెట్రీ నిధుల విడుదలకు ముందుకు రావడం లేదని నీటిపారుదల ఉన్నతాధికారులు సీఎం దృష్టికి తీసుకు వచ్చారు. దాంతో వెంటనే కృష్ణా రివర్‌మేనేజ్‌మెంట్ బోర్డు(కేఆర్‌ఎంబీ)కి సమగ్ర వివరాలతో లేఖ రాయాలని ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఎక్కడా పంటలు ఎండొద్దు
ఎక్కడా కూడా రైతులకు నీటి ఎద్దడిరాకుండా, ఎక్కడా కూడా పంటలు ఎండిపోకుండా చూడాల్సిన బాధ్యత మీదేనని సీఎం స్పష్టం చేశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్, ఎస్సారెస్పీతో పాటు ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రస్తుతం ఉన్న నీటి నిల్వలు, నీటి వినియోగం వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాల పరిధిలో తాగు నీరు, సాగునీటిని అందించేందుకు ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుంటూ ఆయా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక కార్యాచరణ, ప్రణాళికలను రూపొందించుకోవాలని సూచించారు.

కలెక్టర్లకు ఆయకట్టుసాగు బాధ్యతలు
నాగార్జున సాగర్, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు సాగు పంటల విస్తీర్ణం, వాటికి అవసరమైన నీటి విడుదల అంశాలపై ఆయా జిల్లాల కలెక్టర్లు సంబంధిత ఇరిగేషన్ ఇంజనీర్లతో తక్షణమే సమావేశాలు నిర్వహించుకోవాలని సీఎం ఆదేశించారు. ప్రాజెక్టులు, కాల్వలు, ఆయకట్టులో పంటలు, నీటి విడుదల తీరును జిల్లాకలెక్టర్లు స్వయంగా పరిశీలించాలని స్పష్టం చేశారు. నిర్ణీత ఎజెండాను ఖరారు చేసుకొని అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి, తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News