Sunday, December 22, 2024

దీపావళి నుండి జియో 5జీ సేవలు

- Advertisement -
- Advertisement -

 

Reliance AGM 2022

ముంబై: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌  వార్షిక సర్వ సభ్య సమావేశం(ఏజీఎం) కొనసాగుతోంది. ఈ సందర్భంగా రిలయన్స్‌ ఇండస్ట్రీ అధినేత ముఖేష్‌ అంబానీ ప్రసంగిస్తున్నారు. ఈ ప్రసంగంలో 5జీ నెట్‌ వర్క్‌ గురించి అంబానీ కీలక వ‍్యాఖ్యలు చేశారు.  ఈ దివాళీకి ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌ కత‍్తాతో పాటు దేశంలో అన్నీ ప్రధాన నగరాల్లో జియో 5జీ నెట్‌ వర్క్‌లను అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. జియో 5జీ సేవల్ని విస్త్రృతంగా అంబాటులోకి తెచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. డిసెంబర్‌ 2023 నాటికల్లా దేశంలో ప్రతి గ్రామ గ్రామాన జియో 5జీ సేవల్ని వినియోగదారులకు అందిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు.  మేడిన్‌ ఇండియా 5జీ నెట్‌ వర్క్‌ వినియోగంలోకి తెచ్చేందుకు మెటా, గూగుల్‌,మైక్రోసాఫ్ట్‌, ఎరిక్సిన్‌,నోకియా, శాంసంగ్‌,సిస్కో,క్వాల్కంతో భాగస్వామ్యం అవుతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా క్వాల్కమ్‌ సీఈవో క్రిస్టోనా ఆమోన్‌ మాట్లాడారు. త్వరలో జియో 5జీ నెట్‌ వర్క్‌ దేశ వ్యాప్తంగా అందుబాటులోకి రానుందని, వినియోగదారులు 700ఎంహెచ్‌జెడ్‌,3500  ఎంహెచ్‌జెడ్‌, 26ఎంహెచ్‌జెడ్‌ స్పెక్ట్రంను వినియోగించుకోవచ్చని తెలిపారు.

“రిలయన్స్ రిటైల్,  ఇషా నేతృత్వంలోని దాని నాయకత్వ బృందం విపరీతమైన వృద్ధిని అందజేస్తుందని మరియు గ్రూప్‌లో అతిపెద్ద సెగ్మెంట్‌గా అవతరిస్తుందని నేను విశ్వసిస్తున్నాను” అని అంబానీ 45వ వార్షిక సాధారణ సమావేశంలో (ఏజిఎం) కంపెనీ వాటాదారులను ఉద్దేశించి అన్నారు.

ఆర్థిక సంవత్సరం 22లో, రిలయన్స్ రిటైల్ రూ. 2 లక్షల కోట్ల టర్నోవర్ మైలురాయిని దాటింది, అదే సమయంలో రూ. 12,000 కోట్ల EBITDAని సాధించింది. ఆసియాలోని టాప్ టెన్ రిటైలర్‌లలో తమ కంపెనీ ఒకటి అని చైర్మన్ ముఖేశ్ అంబానీ చెప్పారు. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ 45వ ఏజిఎంలో గత సంవత్సరంలో కంపెనీ పనితీరుపై చర్చించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News