Friday, December 20, 2024

రిలయన్స్ ఎజిఎంపైనే అందరి దృష్టి

- Advertisement -
- Advertisement -

ఈ నెల 28న 46వ వార్షిక సర్వసభ్య సమావేశం
టెల్కో, రిటైల్ వ్యాపారాల ఐపిఒల తేదీ
5జి నుంచి క్లీన్ ఎనర్జీలో పెట్టుబడులపై ప్రకటన చేయొచ్చు

న్యూఢిల్లీ : ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎజిఎం (వార్షిక సర్వసభ్య సమావేశం) రేపు (సోమవారం) జరుగనుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ ఎజిఎంలో పెట్టుబడిదారులందరి దృష్టి ముకేశ అంబానీ ప్రసంగంపై ఉంటుంది. అంబానీ ప్రత్యేకంగా ఏదైనా ప్రకటన చేసే అవకాశముందని పెట్టుబడిదారులు ఆశిస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా అంబానీ కుటుంబం సాధారణంగా ఎజిఎంలో కొన్ని పెద్ద ప్రకటనలు చేయనుంది. ఈ కారణంగానే సోమవారం జరగనున్న సభ ప్రత్యేకతను సంతరించుకోనుంది. అయితే ఈ సంవత్సరం అంబానీ కుటుంబం జియో ఫైనాన్స్ లిస్టింగ్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్‌లో వాటాను విక్రయించాలనే నిర్ణయంతో సహా రెండు పెద్ద ప్రకటనలు చేసింది.

రిటైల్ వ్యాపారం ఐపిఒ
రిటైల్ విభాగంలో ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ దాదాపు 1 శాతం వాటాను కొనుగోలు చేసిందని, దేశంలోని అతిపెద్ద రిటైల్ కంపెనీ విలువ 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని గ్రూప్ ప్రకటించింది. అంబానీ రిటైల్ వ్యాపారం విలువ మూడేళ్లలో రెట్టింపు కాగా, ఈ వ్యాపారానికి ఐపిఒ తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

5జి ప్రారంభం
ఈ ఏడాది డిసెంబర్‌లోపు భారతదేశం వ్యాప్తంగా 5జి ప్రారంభించేందుకు రిలయన్స్ జియో సిద్ధమవుతోంది. ఎజిఎంలో ఈ విషయాన్ని వెల్లడించవచ్చు. అదే సమయంలో జియో ఫైనాన్స్ సర్వీస్ వ్యాపారానికి సంబంధించి రోడ్‌మ్యాప్‌లో ప్రకటన చేసే అవకాశముంది. దీంతోపాటు ఇంధన రంగంలో రిలయన్స్ న్యూ ఎనర్జీలో పెట్టుబడికి సంబంధించిన అప్‌డేట్‌ను కూడా ఉండొచ్చు. 2019 సంవత్సరంలో రిలయన్స్ ఎజిఎంలో ముకేశ్ అంబానీ మొదటిసారిగా గ్రూప్ టెలికాం, రిటైల్ వ్యాపారాన్ని లిస్ట్ చేసే ప్రణాళికను ప్రకటించారు.

అదే సమయంలో 2020 సంవత్సరంలో రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ రెండింటిలో వాటాను ప్రధాన ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, సావరిన్ వెల్త్ ఫండ్‌లకు విక్రయించడం ద్వారా అంబానీ భారీ నిధులను సేకరించే ప్రణాళికను రూపొందించారు. దీని తర్వాత రిలయన్స్ రిటైల్ వెంచర్స్ రూ.47,265 కోట్లను సమీకరించగా, కంపెనీ విలువ రూ.4.21 లక్షల కోట్లకు చేరుకుంది. ఎజిఎంలో రిలయన్స్ రిటైల్ ఐపిఒకు సంబంధించిన అంబానీ ప్రత్యేక ప్రకటనలు చేయవచ్చని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News