Monday, December 23, 2024

ఆ రోజు రిలయన్స్ ఉద్యోగులకు సెలవు ప్రకటించిన అంబానీ..

- Advertisement -
- Advertisement -

రిలయన్స్ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ.. తమ ఉద్యోగులకు ఒకరోజు వేతనంతో కూడిన సెలవు ప్రకటించారు. అయోధ్యలో ఈనెల 22వ తేదీన బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేయనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంతో దేశం మొత్తం పండగ వాతావరణంలోకి వెళ్లనుంది.

ఇప్పటికే సెలబ్రేషన్స్ కూడా మొదలయ్యాయి. ఈ మహోన్నత కార్యక్రమానికి దేశవిదేశాలకు నుంచి వివిఐపిలు హాజరుకానున్నారు. దీంతో ప్రాణప్రతిష్ట రోజు కేంద్రం ప్రభుత్వం.. ప్రభుత్వ ఉద్యోగులందరకీ సగం రోజు సెలవు ప్రకటించింది. తాజాగా ముఖేష్ అంబానీ కూడా తమ ఉద్యోగులకు.. ఆ రోజు సెలవు ఇచ్చేందుకు నిర్ణయించారు. దీంతో రిలయన్స్ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని కంపెనీల్లోని ఉద్యోగులకు జనవరి 22న సెలవు ఇచ్చారు. అంబానీ కూడా తన ఫ్యామిలీతో కలిసి బాలరాముడి ప్రాణప్రతిష్ట వేడుకలో పాల్గొనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News