Monday, December 23, 2024

అత్యంత విలువైన భారతీయ కంపెనీగా రిలయన్స్

- Advertisement -
- Advertisement -

2023 హురున్ గ్లోబల్ 500 జాబితా వెల్లడి

న్యూఢిల్లీ : భారతదేశంలో అత్యంత విలువైన కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ తన సత్తా కొనసాగిస్తోంది. 2023 హురున్ గ్లోబల్ 500 ఈ జాబితాను విడుదల చేసింది. బుధవారం విడుదల చేసిన ప్రపంచంలోని 500 అత్యంత విలువైన నాన్- స్టేట్- నియంత్రిత కంపెనీల జాబితాలో టాప్- 40 ర్యాంకింగ్‌లో ఏ ఇతర భారతీయ కంపెనీ స్థానం పొందలేదు. ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 198 బిలియన్ డాలర్ల మొత్తం విలువతో 44వ స్థానంలో కొనసాగుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రిలయన్స్ 10 స్థానాలు పడిపోయిందని ఈ నివేదిక వెల్లడించింది.

60వ స్థానంలో టిసిఎస్
రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) 60వ స్థానం దక్కించుకుంది. ఆ తర్వాత హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 68వ స్థానంలో ఉంది. టిసిఎస్ నికర విలువ 14 శాతం పెరిగి 158 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2023లో టిసిఎస్ ర్యాంక్ ఐదు స్థానాలు మెరుగుపడింది. అనుబంధ సంస్థ హెచ్‌డిఎఫ్‌సితో విలీనం తర్వాత, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ స్థానం 43 స్థానాలు మెరుగుపడింది. ఈ జాబితాలో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 68వ స్థానానికి చేరుకుంది. .

మొదటి స్థానంలో యాపిల్
ప్రపంచవ్యాప్తంగా చూస్తే జాబితాలో టాప్ 5 కంపెనీల్లో మొదటి స్థానంలో యాపిల్ ఉంది. ఆ తర్వాత వరుసగా మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్, అమెజాన్, ఎన్‌విడియా ఒక ట్రిలియన్ డాలర్ల విలువను దాటడం ఇదే తొలిసారి అని జాబితా పేర్కొంది. చాట్ జిపిటి ప్రభావం కంపెనీల పనితీరులో స్పష్టంగా కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News