Monday, December 23, 2024

రిలయన్స్‌కు రష్యా చమురు

- Advertisement -
- Advertisement -

Reliance buys Russia oil

15 మిలియన్ల బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ దిగుమతి
ఆంక్షల నేపథ్యంలోనూ చౌక చమురుకే మొగ్గు : నివేదిక

న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనింగ్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ రష్యా నుంచి చమురును 15 మిలియన్ బ్యారెళ్ల దిగుమతి చేసుకుంటోంది. యుద్ధం కారణంగా రష్యాపై ఆంక్షలు విధించినప్పటికీ రిలయన్స్ భారీగా కొనుగోళ్లు జరుపుతోంది. జూన్ త్రైమాసికానికి నెలకు 5 మిలియన్ బ్యారెళ్ల చొప్పున రిలయన్స్ కొనుగోలు చేస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. అయితే దీనిపై రిలయన్స్ స్పందించలేదు. ఉక్రెయిన్ యుద్ధానికి ముందు రిలయన్స్‌తో సహా భారతీయ రిఫైనరీ సంస్థలు రష్యా నుంచి చాలా అరుదుగా ఆయిల్‌ను కొనుగోలు చేశాయి. దీనికి కారణంగా రవాణా చార్జీలు అత్యధికంగా ఉండడమే. ఉక్రెయిన్‌పై దాడి చేస్తున్న రష్యాపై యూరప్ దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి. దీంతో అత్యధిక డిస్కౌంట్‌తో చమురును విక్రయించేందుకు రష్యా ఆఫర్ చేసింది. చౌక చమురు ఆఫర్‌ను భారతీయ కంపెనీలు సద్వినియోగం చేసుకుంటున్నాయి. ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు దిగుమతి దేశమైన భారత్‌పైనా చమురు ధరల ప్రభావం ఎక్కువగానే ఉంది. దీంతో భారత్ కూడా రష్యాపై ఆంక్షలను ఖాతరు చేయడం లేదు.

రెట్టింపు కానున్న చమురు దిగుమతులు
అమెరికా హెచ్చరించినా రష్యా నుంచి భారత్ ముడిచమురు దిగుమతులను రెట్టింపు చేస్తోంది. ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు శుద్ధి కర్మాగారాలు రష్యా నుంచి పబ్లిక్ టెండర్ల ద్వారా చమురును కొనుగోలు చేయకుండా ప్రైవేట్ ఒప్పందాలు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి, తద్వారా తక్కువ ధరకు సరఫరా చేయవచ్చు. చైనా మాదిరిగానే భారత్ కూడా రష్యా నుంచి చమురును కొనుగోలు చేయనుందని అంటున్నారు. భారత్ గతంలో రష్యా నుంచి అన్ని రకాల క్రూడ్ ఆయిల్‌లను కొనుగోలు చేసింది.

సాధారణంగా చైనా రష్యా చమురును కొనుగోలు చేస్తున్న విధానాన్ని ఇప్పుడు భారత్ కూడా అవలంభిస్తోంది. రష్యా -ఉక్రెయిన్ మధ్య యుద్ధం మూడు నెలలుగా జరుగుతోంది. రష్యాపై ఆంక్షలు, సరఫరా అవరోధాల కారణంగా ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 110 డాలర్లు దాటాయి. దిగుమతులను తగ్గించాలని యూరోపియన్ యూనియన్‌లు ప్రయత్నిస్తున్నాయి. ఈ పరిస్థితిలో భారతదేశం వంటి పెద్ద చమురు దిగుమతిదారులు చౌకైన ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News