రూ.1,38,222.46 కోట్లు పెరిగిన మార్కెట్ క్యాపిటలైజేషన్
టిసిఎస్, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్ కూడా..
ముంబయి : గత వారం దేశీయ స్టాక్‌మార్కెట్ ట్రేడింగ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ స్క్రిప్ట్ దూసుకెళ్లింది. దీనితో పాటుగా టాప్10 స్టాక్స్‌లో నాలుగుసంస్థల మార్కెట్ విలువ(క్యాపిటలైజేషన్ ) రూ.2,31,320.37 కోట్లు లాభపడ్డాయి. గత వారం సెన్సెక్స్ 884.57 పాయింట్లు లాభపడిన విషయం తెలిసిందే. రిలయన్స్ భారీగా లాభపడగా, టిసిఎస్,ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్ లాభపడిన కంపెనీల్లో ఉన్నాయి.
కాగా హెచ్‌డిఎఫ్‌బిసి బ్యాంక్ , హిందుస్థాన్ యూనిలీవర్( హెచ్‌యుఎల్), ఎల్‌ఐసి, ఎస్‌బిఐ,హెచ్‌డిఎఫ్‌సి, భారతీ ఎయిర్‌టెల్ రూ. 68,140.72 కోట్ల మేర మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను కోల్పోయాయి. రిలయన్స్ స్క్రిప్ట్ రూ. 1,38,222.46 కోట్లు పుంజుకుని రూ.18,80,350.47 కోట్ల వద్ద స్థిరపడంది. ఐటి దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టిసిఎస్) రూ.64,618.85 కోట్లు లాభపడడంతో దాని ఎంక్యాప్ రూ.12,58,274.59 కోట్లకు చేరింది. మరో ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 25,728.52 కోట్లు పెరిగి రూ.6,40,373.02 కోట్లకు చేరింది. ఐసిఐసిఐ బ్యాంక్ మార్కెట్ విలువ రూ. 2,750.49 కోట్లు పెరిగి రూ.5,17,049.46 కోట్లకు చేరింది. మరో వైపు భారతీ ఎయిర్‌టెల్ మార్కెట్ విలువ రూ.25,955,25 కోట్లు తగ్గడంతో దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.3,76,972.75 కోట్లకు చేరింది.
అలాగే భారతీయ జీవిత బీమా సంస్థ( ఎల్‌ఐసి) ఎంక్యాప్ రూ.13,472.25 కోట్లు తగ్గి రూ.5,06,157.94 కోట్లకు చేరింది.హెచ్‌డిఎఫ్‌సి మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 9,355.02 కోట్లు పతనమై రూ.4,13,299.36 కోట్లకు చేరింది. అలాగే హిందుస్థాన్ యూనిలీవర్(హెచ్‌యుఎల్) ఎంక్యాప్ రూ.8,963.69 కోట్లు తగ్గి రూ.8,963.69 కోట్లు తగ్గి రూ.5,38,561.56 కోట్ల వద్ద స్థిరపడింది.హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,199.94 కోట్లు నష్టపోయి రూ.7,66,134.71 కోట్లుకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( ఎస్‌బిఐ) ఎంక్యాప్ రూ. 4,194.57 కోట్లు కోల్పోయి రూ.4,14,369.71 కోట్లకు చేరాయి. శుక్రవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత బిఎస్‌ఇ10లో రిలయన్స్ అగ్రస్థానంలో ఉండగా, టిసిఎస్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్‌యుఎల్, ఐసిఐసిఐ బ్యాంక్ , ఎల్‌ఐసి, ఎస్‌బిఐ, హెచ్‌డిఎఫ్‌సి, భారతీ ఎయిర్‌టెల్ వరసగా తర్వాతిస్థానాల్లో నిలిచాయి.
రూ. 2.5 లక్షల కోట్లు వెనక్కి
ప్రతి రోజూ విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు(ఎఫ్‌పిఐ) భారతదేశంలోని ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాలు జ రుపుతూనే ఉన్నారు. ప్రపంచ, దేశీయ పరిణామాల వల్ల వారు పెట్టబడులను ఉపసంహరించుకుంటున్నారు. 2021 అక్టోబర్ నుండి విదేశీ పెట్టుబడిదారులు భారతీయ స్టాక్ మార్కెట్‌లో దాదాపు రూ. 2.5 లక్షల కోట్లు (32 బిలియన్ డాలర్లు) విలువైన షేర్లను విక్రయించారు. ఎన్‌ఎస్‌డిఎల్ (నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్) డేటా ప్ర కారం, విదేశీ పెట్టుబడిదారులు గత 7 నెలల పన్నును విక్రయించారు. 2014 2020 మధ్య కాలంలో విదేశీ పెట్టుబడిదారులు భారతీయ స్టాక్ మార్కెట్లో రూ. 2.2 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టారు. అదే సమయంలో 2010 2020 మధ్య మొత్తం రూ.4.4 లక్షల కోట్లు పెట్టుబడి పె ట్టారు. కానీ 7 నెలల్లో ఈ పెట్టుబడిదారులు చేసిన అమ్మకాలతో పెట్టుబడి సగం పడిపోయింది.
కరోనా మహమ్మారి కాలంలో రిటైల్ ఇన్వెస్టర్లు భారతీయ స్టాక్ మార్కెట్‌లో పె ట్టుబడులు పెట్టకపోతే మార్కెట్ మరింత పతనం అయ్యేది. గత రెండేళ్లలో 202021 రిటైల్ ఇన్వెస్టర్లు భారతీయ స్టాక్‌మార్కెట్‌లో రూ. 2.1 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టారు. గత రెండేళ్లలో డీమ్యాట్ ఖాతాల సంఖ్య రెట్టింపు అయింది. విదేశీ ఇన్వెస్టర్లు ఈ కాలంలో రూ.2.2 లక్షల కోట్లను వె నక్కి తీసుకున్నారు. దేశీయ మ్యూచువల్ ఫండ్స్ కూడా రెండేళ్లలో భారత స్టాక్ మార్కెట్లో రూ.లక్ష కోట్లకు పైగా పెట్టుబడి పెట్టాయి. రిటైల్ ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల కారణంగా విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున తరలివెళ్లినప్పటికీ భారత మార్కెట్లు పెద్దగా నష్టపోలేదు. అక్టోబర్ నుంచి భారత స్టాక్ మార్కెట్‌లో అమ్మకాలు మొదలయ్యా యి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దేశాలలో ద్రవ్యోల్బణం పెరిగింది. దీని కారణంగా కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచవలసి వచ్చింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌తో పాటు, ఫె డరల్ రిజర్వ్, ఇప్పుడు ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాం క్) కూడా వడ్డీ రేట్లను పెంచాయి. ఆ తర్వాత విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు పెరిగాయి.