Sunday, April 6, 2025

రిలయన్స్ డిజిటల్ ‘ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సేల్’

- Advertisement -
- Advertisement -

Reliance Digital's 'Festival of Electronics Sale'

మన తెలంగాణ/ హైదరాబాద్ : దీపావళి పండుగ సందర్భంగా రిలయన్స్ డిజిటల్ ‘ఫెస్టివల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ సేల్’ను ప్రకటించింది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై బంపర్ ఆఫర్లను అందిస్తోంది. ఈజీ ఇఎంఐ, ఇన్‌స్టా డెలివరీ ఆప్షన్‌తో పాటు ప్రముఖ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులపై 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను ఇస్తోంది. అదనంగా తదుపరి కొనుగోళ్లకు 10 శాతం రిడీమబుల్ డిస్కౌంట్ ఓచర్లను ప్రకటించింది. రిలయన్స్ డిజిటల్ స్టోర్స్, మై జియో స్టోర్స్‌తో పాటు రిలయన్స్‌డిజిటల్.ఇన్ వెబ్‌సైట్‌లో ఈ ఆఫర్లను పొందవచ్చు.

రిలయన్స్ డిజిటల్ ఆఫర్లు

ఐఫోన్ 12 ప్రారంభ ధర రూ.29,900, సామ్‌సంగ్ ఎం13 5జి ప్రారంభ ధర రూ.13,999, సామ్‌సంగ్ ఎస్22 ప్రారంభ ధర రూ.52,999 మాత్రమే ఉంది.

స్మార్ట్ వాచ్‌ల ప్రారంభ ధర రూ.999, బిటి కాలింగ్ వాచ్‌ల ప్రారంభ ధర రూ.1,499, యాపిల్ వాచ్‌ల ప్రారంభ ధర రూ.14,990.

ఇక టీవీలపైనా అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. క్యాష్ బ్యాక్ తర్వాత సామ్‌సంగ్ నియో క్యూఎల్‌ఇడి, టిసిఎల్ క్యూఎల్‌ఇడి రూ.36,990కు ఆఫర్ చేస్తోంది. సామ్‌సంగ్ నియో క్యూఎల్‌ఇడితో రూ.21,490 విలువచేసే సామ్‌సంగ్ మొబైల్ ఎ32ని ఉచితంగా పొందవచ్చు.

క్యాష్ బ్యాక్ తర్వాత జెబిఎల్ సౌండ్‌బార్ 5.1 రూ.56,999 మాత్రమే పొందవచ్చు. 12 నెల వరకు నో కాస్ట్ ఇఎంఐ లభిస్తోంది. యాపిల్ ఎయిర్‌పాడ్స్ ప్రొ రూ.15,999కే పొందవచ్చు.

వాషింగ్ మిషన్‌లో అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్‌లు 2 ఏళ్ల వారెంటీతో రూ.19,490కి లభిస్తున్నాయి. రిలయన్స్ డిజిటల్‌లో సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్‌ల కొనుగోలుపై స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్స్, వ్యాక్యూమ్ క్లీనర్స్, సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్స్ వంటి గిఫ్ట్‌లను కూడా పొందవచ్చు.

ల్యాప్‌టాప్స్ కొనాలనుకునేవారికి కూడా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. గేమింగ్ ల్యాప్‌టాప్స్ ప్రారంభం ధర రూ.49,999, ఇంటెల్ కోర్ ఐ5 ల్యాప్‌టాప్స్ ప్రారంభ ధర రూ.38,999గా ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News