- Advertisement -
న్యూఢిల్లీ : ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన వ్యాపారాలను స్వాధీనం చేసుకునేందుకు గాను రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్(ఆర్‌ఆర్‌విఎల్) తన వాటాదారులతో, రుణదాతలతో సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు ఎన్‌సిఎల్‌టి ఆమోదం తెలిపింది. ఇకామర్స్ దిగ్గజం లేవనెత్తిన అంశాలు అకాలమైనవని, తర్వాత దశలో వాటిని పరిష్కరించవచ్చని ఎన్‌సిఎల్‌టి (నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) పేర్కొంది. సెప్టెంబర్ 28న ఆరు ఫ్యూచర్ గ్రూప్ కంపెనీలకు తన వాటాదారులు, రుణ సంస్థలతో సమావేశం నిర్వహించుకునేందుకు ఎన్‌సిఎల్‌టి అనుమతి ఇచ్చింది. 2020 ఆగస్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ ఆర్‌ఆర్‌విఎల్ ఫ్యూచర్ గ్రూప్‌ను రూ.24,713 కోట్లకు కొనుగోలు చేసింది. నిబంధనల ప్రకారం, ఇరు సంస్థల విలీనం, స్వాధీనాలకు కోర్టు అనుమతి అవసరమైంది. ఆ తర్వాత డీల్ ఆమోదం కోసం ఇరు సంస్థలు ఎన్‌సిఎల్‌టిని ఆశ్రయించాయి.
- Advertisement -